NTV Telugu Site icon

Bhatti Vikramarka : దేశ చరిత్రలో లిఖించదగ్గ రోజు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ లో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల ముందు ఛాలెంజ్ చేసి రుణ మాఫీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ రోజు చరిత్రలో లిఖించదగిన రోజు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఛాలెంజ్ చేసి ఆగస్టు 15నాటికి రుణమాఫీ చేస్తామని చెప్పాం… చేసి చూపించామన్నారు.

BSA Gold Star 650: భారత మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650.. ధర ఎంతంటే..?

గత సర్కార్ నాలుగు దఫాలుగా ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పదేళ్లలో బీఆర్ ఎస్ సర్కర్ లక్ష రుణమాఫీ కూడా చేయలేదన్నారు. పదేళ్లలో వేలకోట్లు ఖర్చు చేసి సీతారామ ప్రాజెక్టు కట్టారు.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. రూ. 30వేల కోట్లతో పూర్తి చేయాల్సిన కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను రూ లక్షా 30వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కమీషన్లకోసమే ఇందిర, రాజీవ్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని భట్టి చెప్పారు.

Minister Seethakka : మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్?

మరోవైపు గురువారం ఆగస్టు 15 నాడు ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌజ్ లను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మొదటి పంప్ హౌజ్ ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించగా.. ములకలపల్లి మండలం కమలాపూరం వద్ద మూడో పంప్ హౌజ్ ను డిప్యటీ సీఎం భట్టి ప్రారంభించారు.