NTV Telugu Site icon

Bhaskar Reddy: నాని హైడ్రామా చేశారు.. తిరుపతి దాడి ఘటనపై భాస్కర్ రెడ్డి వీడియో ప్రజంటేషన్

New Project (28)

New Project (28)

తనపై దాడి విషయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”నామినేషన్ రోజు నాపై దాడి చేశారు. మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప, ఆయనపై దాడి చేయలేదు. కానీ దాడిని నేను కూడా ఖండిస్తున్నాను. దాడి తరవాత కూడా నాని చాలా హుషారుగా ఉన్నారు. కానీ చేతులకు, కాళ్ళకు గాయాలు అని డ్రామాలు ఆడారు. నాని భార్య సైతం ఇదే తరహాలో లేని గాయాలు సృష్టించి డ్రామాలు ఆడుతున్నారు. పులివర్తి నాని పై దాడి విషయంలో అనవసరంగా మమ్మల్ని దోషులు చేస్తున్నారు. నాని ఆడిన డ్రామాల వల్ల ఇప్పుడు ఎంతో మంది అధికారులు, నేతలు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి దాడులు సరికాదు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వాడిని హుందాగా వ్యవహరిస్తాను. ఈ ఐదేళ్లు నన్ను ఎంత దూషించినా నేను స్పందించలేదు. పులివర్తి నాని దంపతులను నేను ఏనాడూ విమర్శించ లేదు. ఈ ఐదేళ్లు వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.” అని ఆయన ఉద్ఘాటించారు.

READ MORE: Brahmaputra Express: ఏంటి భయ్యా ఇది.. ఏసీ కంపార్ట్‌మెంట్ కాస్త జనరల్ బోగి ఐపోయిందిగా..

నాని చేస్తున్న క్వారీ వ్యాపారాల జోలికి తాను ఎప్పుడూ వెళ్లలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. “నాని భార్య మమ్మల్ని వ్యక్తిగతంగా ఎన్నో దూషించారు. రెండేళ్ల ముందు నియోజకవర్గాన్ని వదిలేద్దామని అనుకున్నాను. కానీ చంద్రగిరి ప్రజలతో ఏర్పడ్డ అనుబంధాన్ని వదలలేక, నా కుమారుడిని బరిలో నిలిపాను.” అని వ్యాఖ్యానించారు. కాగా.. పోలింగ్ రోజు చంద్రగిరిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్న విషయం తెలిసిందే. ఈఘటనపై సీరియస్ అయిన ఈసీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సైతం ఏర్పాటు చేసిన విషయం విదితమే. తాజాగా కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాగం చర్యలు తీసుకుంది. విజయోత్సవ ర్యాలీలకు సైతం అనుమతి లేదని స్పష్టం చేసింది.