మాస్ జాతర ప్లాప్ తో డీలాపడిన మాస్ మహారాజ్ రవితేజ దర్శకుడు కిషోర్ తిరుమలతో చేస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తిపైనే ఆశలన్ని పెట్టుకున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ జానర్ లో ఎమోషన్స్ కలగలిపి “భర్త మహాశయులకు విజ్ఞప్తి” పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తో వచ్చారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన రవితేజ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తన కంఫర్ట్ జోన్ లో సినిమా చేసాడు. మరి ఈ సినిమా ఓవర్సీస్ రివ్యూ ఎలా ఉందొ చూద్దాం రండి.
కథ పెద్దగా లేదు స్క్రీన్ ప్లే కూడా గొప్పగా ఉండదు కానీ దర్శకుడు ఆడియెన్స్ ను నవ్వించాలని డిసైడ్ అయ్యాడు. అందుకు తగ్గట్టే కామెడీ సీన్స్ ను గట్టిగా రాసుకున్నాడు. చాలా వరకు కామెడీ బాగా పనిచేసింది. అక్కడక్కడా తడబాటులు ఉన్నాయి, మరియు కొన్ని బిట్స్ అతిగా ఉన్నాయి, కానీ అది ఎక్కడ బోర్డర్ దాట కుండా ఫ్లోలో ఉంది. ఇక సెకండాఫ్ లోనే ఉంది అసలైన కామెడీ . కథని కొంచం లాగినట్టు అనిపించినా కూడా మాస్ ని లక్ష్యంగా చేసుకున్న కొన్ని కామెడీ బిట్స్ కడుపుబ్బా నవ్వించాయి. ముఖ్యంగా సునీల్ చాలా కాలం తర్వాత సూపర్బ్ కామెడీ చేసాడు. ఇక సత్య కూడా తన కామెడీతో అదరగొట్టాడు. కథ, స్క్రీన్ ప్లే ఇవేవి చూడకుండా కేవలం ఫ్యామిలితో వెళ్లి సరదాగా నవ్వుకోవడానికి పర్ఫెక్ట్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. అలాగని ఇదేదో క్రింజ్ కామెడీ కాదు క్లాస్ కామెడీ. రవితేజ తన ఇటీవలి చిత్రాలతో పోలిస్తే ఇది బెస్ట్ సినిమా అనే టాక్ ఓవర్సీస్ నుండి వస్తోంది.
