Bhartha Mahashayulaku Vignapthi: కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి బజ్‌ను సృష్టించాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
READ ALSO: Hyderabad Cyber Fraud: మామూలు కి’లేడి’ కాదయ్యో.. ఇల్లు గుల్ల చేసిందిగా!
ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. “రవితేజ ఈ సినిమాకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కానీ ఆయన ఈ సినిమాకు సంబంధించి ఒక కండిషన్ పెట్టారు. అదే ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్ చేస్తే బాగుంటుందని. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని చెప్పి, కచ్చితంగా రిలీజ్ చేయాలనే కండిషన్ పెట్టారు” అని అన్నారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతోందని అన్నారు. కచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌తో మన తెలుగు ప్రేక్షకులకు మంచి ఫన్, సాంగ్స్ అన్నీ కలిపి మీ అందరినీ ఆకట్టుకునేలాగా ఈ సినిమా 100% ఉంటుందని చెప్పారు. రవితేజకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఉద్దేశంతోనే ఈ కథ రాసినట్లు తెలిపారు. ఈ సినిమా డెఫినెట్‌గా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
READ ALSO: Sandeep Reddy Vanga: ‘ధురంధర్’పై సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రివ్యూ!
