మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేస్తోంది. పండుగ రేసులో భారీ పోటీ ఉన్నప్పటికీ, తన పాత వింటేజ్ కామెడీ టైమింగ్‌తో రవితేజ మరోసారి తనదైన మార్క్ చూపించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. వరుస సినిమాల తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న రవితేజకు, ఈ సినిమా మంచి బజ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
Also Read : Toxic : టాక్సిక్’ టీజర్‌పై మహిళా కమిషన్ ఫైర్.. యశ్ సినిమాకు పెద్ద షాక్!
ఇక ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ ‘జీ’ (Zee) గ్రూప్ కైవసం చేసుకుంది. థియేటర్లలో రన్ ముగిసిన తర్వాత, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ‘జీ5’ (Zee5) ఓటీటీలో అందుబాటులోకి వస్తాయి. అలాగే, బుల్లితెర ప్రేక్షకులకు కూడా ‘జీ తెలుగు’ ఛానల్ ద్వారా ఈ సినిమా కనువిందు చేయనుంది. ఓటీటీ శాటిలైట్ హక్కులు రెండూ ఒకే సంస్థ దగ్గర ఉండటం విశేషం.
