NTV Telugu Site icon

Bhartat Biotech : భవిష్యత్ ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్, ఎల్లా ఫౌండేషన్ మరో ముందడుగు

Bharat Biotech

Bharat Biotech

భవిష్యత్ ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొనేందుకు మరో ముందడుగు వేశాయి భారత్ బయోటెక్, ఎల్లా ఫౌండేషన్. అయితే.. తాజాగా గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్-మాడిసన్, ఎల్లా ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయ విద్యా పరిశోధన విభాగం, బయోటెక్నాలజీ కార్యదర్శుల సమక్షంలో ఒప్పంద పత్రాలపై రెండు సంస్థల అధిపతులు సంతకాలు చేశారు. బెంగుళూరులో యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ తో కలిసి “వన్ హెల్త్ సెంటర్” ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నూతన పరిశోధనలు, టీకాలు, చికిత్సా విధానాలు, ప్రపంచ ఆరోగ్య విద్యను అభివృద్ధి చేయడానికి భారతదేశంలో ఏర్పడుతున్న మొట్టమొదటి UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. గ్లోబల్ హెల్త్‌ను అభివృద్ధి చేయడం, ఆరోగ్య పర్యవేక్షణ, పరిశోధనలు, విద్య, ప్రచారాలు, మానవులు, జంతువులు, మొక్కలలో అంటు వ్యాధులను నివారించడం కోసం పని చేయనుంది UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్.

Also Read : Kalyan Ram: బింబిసార రిజల్ట్ రిపీట్ అవుతుంది.. మళ్లీ కాలర్ ఎగరేస్తాం

భారతదేశంలో నూతన వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడంపై UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్ దృష్టి పెట్టనుంది. ఇంటర్ డిసిప్లినరీ సహకారాన్ని అందించడం ద్వారా విస్కాన్సన్ యూనివర్సిటీ ఆలోచనలను ఎల్లా ఫౌండేషన్, భారత్ బయోటెక్‌ విస్తరించనుంది. 2023 చివరి నాటికి బెంగళూరులో అందుబాటులోకి UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్ రానుంది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్-మాడిసన్ బాడ్జర్ ఉత్సవ్‌లో “బ్యాడ్జర్స్ బిల్డింగ్ ఎ బెటర్ వరల్డ్” కార్యక్రమంలో ఒప్పందం కుదిరింది. భారతదేశం కోసం కొత్త వ్యాక్సిన్‌ల అభివృద్ధి, ఉత్పత్తిని ముందుకు తీసుకువెళ్లనుంది UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్. భారతీయ విద్యార్థులకు, పరిశోధకులకు నైపుణ్య శిక్షణకు సహకారం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ అందించనుంది. భారత్ లో పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించనుంది UW-మాడిసన్ వన్ హెల్త్ సెంటర్. పరిశోధనలు, పరస్పర ఆలోచనలు పంచుకుంటూ… నూతన ఆవిష్కరణలకు గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్, ఎల్లా ఫౌండేషన్ ప్రాధాన్యత ఇవ్వనుంది.

Also Read : Amigos Event: నాటు నాటు పాటకి డాన్స్ చేసిన బ్రహ్మాజీ… పడి పడి నవ్విన ఎన్టీఆర్