Kishore Tirumala: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. సినిమాపై తన నమ్మకాన్ని, టీమ్‌పై ఉన్న విశ్వాసాన్ని తెలిపారు. మీడియా ప్రతినిధులు, అభిమానులకు నమస్కారం తెలియజేస్తూ స్పీచ్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సినిమా జర్నీ తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందన్నారు.
Ashika Ranganath: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగిన ‘రవితేజ’ మాకు ఇన్‌స్పిరేషన్..!
సినిమా ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు పని చేస్తూనే ఎంజాయ్ చేశానని కిషోర్ తిరుమల తెలిపారు. ముఖ్యంగా ఈ స్క్రిప్ట్‌లో తనకు బాగా నచ్చిన అంశం కామెడీ అని చెప్పారు. ఎంత బాగా రాసుకున్నా కూడా కామెడీ అనేది పూర్తిగా నటుల మీదే ఆధారపడి ఉంటుందని, ఈ సినిమాలో పనిచేసిన నటుల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్క్ అవ్వడం వల్లే ఈ స్థాయి కామెడీ వచ్చిందని.. నటులందరికీ ప్రత్యేకంగా థాంక్స్ తెలిపారు.
కేవలం రూ.21,599కే 55 అంగుళాల BESTON QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ..!
జనవరి 13న విడుదల కానున్న ఈ సినిమాలో డైలాగ్స్ ప్రేక్షకులకు తప్పకుండా బాగా నచ్చుతాయని, సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. “కచ్చితంగా మీకు నచ్చుతుంది” అంటూ ప్రేక్షకులను థియేటర్లకు రావాలని కోరారు. అలాగే ఈవెంట్ మధ్యలో జరిగిన సరదా ఘట్టాలు అందరినీ నవ్వించాయి. కిషోర్ తిరుమల డాన్స్ చేయాలని అభిమానులు, యాంకర్ అడగడం, వేదికపై సరదా సంభాషణలు జరగడం ఈవెంట్‌కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. స్వల్పంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈవెంట్‌కు హాజరైన కిషోర్ తిరుమల చివరగా “జనవరి 13న సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అంటూ స్పీచ్ ముగించారు.
