NTV Telugu Site icon

Bharateeyudu-2: భారతీయుడా మజాకా.. గుర్రంపై స్వారీ చేస్తూ థియేటర్‌కు..

Bharateeyudu 2

Bharateeyudu 2

Bharateeyudu-2: లోకనాయకుడు కమల్‌హాసన్‌, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు-2′(Indian-2). 28 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్‌. ఈ సినిమాను లైకా సంస్థ, రెడ్ జెయింట్ సంస్థ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కమల్‌ హాసన్‌ మరోసారి సేనాపతిగా కనిపించనుండడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య నేడు భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది.

ఇప్పటి వరకు ఈ సినిమాకు చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాపై కమల్ హాసన్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఫ్యాన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. చెన్నైలో ఓ అభిమని ‘భారతీయుడు-2’ సినిమాను చూసేందుకు వినూత్న రీతిలో థియేటర్‌ వద్దకు ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో కమల్ పోషించిన ‘సేనాపతి’ పాత్రలా డ్రెస్‌ ధరించి.. తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ థియేటర్ వద్దకు వచ్చాడు. చేతిలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ర‌వివ‌ర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు.