Site icon NTV Telugu

Bharat Ratna PV Narasimha Rao: పీవీ నరసింహారావుకి భారత రత్న.. స్వగ్రామంలో సంబరాలు

New Project (50)

New Project (50)

తెలంగాణ ప్రియతమ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది. భారతరత్న దేశ అత్యున్నత పౌర పురస్కారం. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు కూడా కేంద్రం శుక్రవారం భారతరత్న అవార్డును ప్రదానం చేసింది. దీంతో అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పీవీకి భారతరత్న ప్రకటించడంపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Minister Roja : ఆడుతాం యువత భవిష్యత్‌కు నిదర్శనం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న అవార్డు ఇవ్వడం పట్ల పీవీ స్వగ్రామం వంగర గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. పీవీకి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. భారత దేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చి అభివృద్ధికి తోడ్పడిన పీవీని గౌరవించడం సంతోషకరం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. పీవీ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా.. బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వంగర గ్రామస్థులు కోరుతున్నారు.

Read Also: Bharat Ratna PV Narasimha Rao: దివంగత ప్రధాని పీవీ కి భారత రత్న.. హర్షం వ్యక్తం చేసిన నేతలు

Exit mobile version