Site icon NTV Telugu

Bharat Biotech: బూస్టర్‌ డోస్‌గా భారత్ బయోటెక్‌ చుక్కల మందు టీకా

Bharat Biotech

Bharat Biotech

Bharat Biotech: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా ‘ఇన్‌కొవాక్‌’ను బూస్టర్‌ డోస్‌గా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అనుమతి ప్రకారం ఇప్పటివరకు రెండు డోసుల కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారు 6నెలల తర్వాత బూస్టర్‌ డోస్‌గా ఈ చుక్కల మందు టీకా తీసుకోవచ్చు. చుక్కల మందు టీకాను (నాసల్‌ వ్యాక్సిన్‌) ‘బూస్టర్‌ డోసు’ కింద వినియోగించేందుకు అవసరమైన క్లినికల్‌ పరీక్షల నిర్వహణ అనుమతి అంశాన్ని డీసీజీఐకి (డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) పరిశీలిస్తోంది. ఇందుకోసం మంగళవారం సమావేశమై చర్చించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి ‘బూస్టర్‌ డోసు’ కింద ఈ చుక్కల మందు టీకా అనువైనదని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. దీన్ని ‘ఫైవ్‌ ఆర్మ్స్‌’ బూస్టర్‌ డోసుగా వ్యవహరిస్తారు. ఈ టీకాను భారత్‌ బయోటెక్‌, అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ- సెయింట్ లూయిస్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. మనదేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

Son in Law Cheating: పిల్లనిచ్చిన మామకే శఠగోపం.. 107 కోట్లు కాజేసిన అల్లుడు!

ఇకపోతే, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో బూస్టర్ డోసులపై అనేక దేశాలు దృష్టి సారించాయి. అందువల్ల చుక్కల మందు టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనువైన క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. దాదాపు 500 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించాలని భారత్ బయోటెక్ యోచిస్తోంది. అయితే రెండు డోసులు తీసుకున్న తర్వాత 6 నుంచి 9 నెలల వ్యవధిలో బూస్టర్ డోస్ తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా చుక్కుల మందు అందుబాటులోకి తీసుకురావాలని భారత్ బయోటెక్ భావిస్తోంది. సాధారణంగా రెండో డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 9 నెలల వ్యవధిలో బూస్టర్‌ డోసు తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

Exit mobile version