Site icon NTV Telugu

Shivaratri Special : మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్‌ సాంగ్‌

Jangama Song

Jangama Song

మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు. మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. అయితే.. ఈ నేపథ్యంలో భక్తి, వనిత, ఎన్టీవీ వారు ప్రత్యేక మహాశివరాత్రి స్పెషల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.

Exit mobile version