Site icon NTV Telugu

Bhaje Vaayu Vegam : “భజే వాయు వేగం” మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్..

Karthikeya

Karthikeya

Bhaje Vaayu Vegam : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ “ఆర్ఎక్స్ 100 ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతోనే ఈ యంగ్ హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించిన కార్తికేయకు మొదటి సినిమా రేంజ్ హిట్ లభించలేదు.ఈ యంగ్ హీరో గత ఏడాది ‘బెదురులంక 2012’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు.నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఇదిలా ఉంటే హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం’.

Read Also :Sriranga Neethulu : ఓటీటీ లో అదరగొడుతున్న సుహాస్ శ్రీరంగ నీతులు..

ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించారు.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ గ్రాండ్ గా రూపొందించింది.ఈ సినిమాలో హీరో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ ముఖ్య పాత్ర పోషించాడు. నేడు(మే 31) గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో హీరో కార్తికేయ తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి పార్టనర్ ఫిక్స్ అయ్యింది.ఈ సినిమా ఓటిటి రైట్స్ ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.థియేటర్ రన్ పూర్తి కాగానే ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కు రానుంది.

Exit mobile version