Site icon NTV Telugu

Bhairavadweepam : రీ రిలీజ్ కాబోతున్న బాలయ్య క్లాసిక్ మూవీ..

Whatsapp Image 2023 07 25 At 5.51.32 Pm

Whatsapp Image 2023 07 25 At 5.51.32 Pm

తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోలు అందరి సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఎంతో భారీగా కలెక్షన్స్ రాబట్టాయి.ఈ క్రమంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరియర్ లో నే మైల్ స్టోన్ నిలిచి అద్భుతమైన విజయాన్ని అందుకున్న భైరవద్వీపం సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం లో వచ్చిన భైరవద్వీపం అద్భుత విజయం సాధించింది.ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా రోజా అద్భుతంగా నటించింది. అలాగే హాట్ బ్యూటీ రంభ ప్రత్యేక గీతంలో అలరించింది.

ఈ సినిమా విడుదల అయి దాదాపు 29ఏళ్లు పూర్తి అవుతుంది..దీనితో ఈ సినిమా ని మళ్లీ రిలీజ్‌ చేస్తున్నారు. ఆగస్ట్ 5న 4k రిజల్యూషన్‌తో ఈ మూవీని విడుదల చేస్తున్నారు.. క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్స్ పతాకంపై పీవీ గిరి రాజు మరియు పి దేవ్‌ వర్మ ఈ సినిమాని రీ రిలీజ్‌ చేస్తున్నారు. అప్పట్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..ఇప్పటికే బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే వీరసింహారెడ్డి సినిమా తో ఈ ఏడాది ఆరంభంలోనే మంచి విజయం అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 19 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ధీమాగా వున్నారు.

Exit mobile version