Site icon NTV Telugu

Bhagyashri Borse: లక్కీ ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. స్టార్ హీరోతో రొమాన్స్!

Bhagyashri Borse

Bhagyashri Borse

Bhagyashri Borse in Dulquer Salmaan’s Kaantha: మోడలింగ్‌లో రాణించిన ముంబై భామ భాగ్యశ్రీ బోర్సే.. 2023లో ‘యారియాన్ 2’ హిందీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. తొలి సినిమానే హిట్ కావడంతో భాగ్యశ్రీకి కార్తీక్ ఆర్యన్ నటించిన ‘చందు ఛాంపియన్‌’లో నటించే అవకాశం వచ్చింది. ఇక ‘మిస్టర్ బచ్చన్‌’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. యువ హృదయాలను కొల్లగొట్టేశారు. భాగ్యశ్రీ డ్యాన్స్‌, హావభావాలకు అందరూ ఫిదా అయ్యారు. మిస్టర్ బచ్చన్‌ డిజాస్టర్ అయినా.. భాగ్యశ్రీకి స్టార్ హీరో సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ వచ్చింది.

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే నటించనున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, నీలా ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాంత’ చిత్రంలో భాగ్యశ్రీ నటిస్తున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేయగా.. తాజాగా పూజా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగ్యశ్రీ పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: Cobra Viral Video: తండ్రి చెప్పాడని పామును నోట్లో పెట్టుకున్న యువకుడు.. చివరకు ఏమైందంటే?

కాంత సినిమాలో తెలుగు హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. దుల్కర్‌, రానా, భాగ్యశ్రీలు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటో నెట్టింట వైరల్ అయింది. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా కాంత చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. ఇందులో దుల్కర్‌ పాత్ర సరికొత్తగా ఉంటుందని టాక్‌. దుల్కర్‌ నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఈ దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది.

Exit mobile version