Site icon NTV Telugu

Bhagavanth Kesari Trends: జననాయకుడి దెబ్బకి బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రేండింగ్ లోకి..!

Bhagavanth Kesari Trends

Bhagavanth Kesari Trends

Bhagavanth Kesari Trends: ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 థియేటర్లలో సందడి చేస్తుండగానే.. ఆయన నటించిన ఇదివరకు చిత్రం భగవంత్ కేసరి సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లోకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం విజయ్ నటిస్తున్న కొత్త సినిమా ‘జననాయకుడు’.

విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో నటుడిగా ఇదే చివరి సినిమా అనే ప్రచారం జననాయకుడుకి భారీ హైప్ తెచ్చింది. మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ వేడుక గ్రాండ్‌గా జరగడంతో, తమిళంలో ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉంటాయని అభిమానులు లెక్కలు వేసుకున్నారు. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. జననాయకుడు సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అనే విషయంలో తప్పు లేదని సినీ విశ్లేషకులే అంటున్నారు. అయితే సమస్య కథ ఎంపికలో కాదు.. టైమింగ్‌లో, ప్రజెంటేషన్‌లో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Meenakshi Chaudhary: సుశాంత్ తో డేటింగ్, పెళ్లి.. మీనాక్షి చౌదరి ఏమందంటే..!

ఎన్నికలకు ముందు విడుదలయ్యే సినిమా కావడంతో, రాజకీయ మెసేజ్ ఉన్న కథ విజయ్‌కు ఉపయోగపడుతుందని భావించి భగవంత్ కేసరి లైన్‌ను ఎంచుకున్నారు. రాజకీయాలకు కనెక్ట్ అయ్యేలా కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా జోడించారు. కానీ మేకర్స్ “లైన్ మాత్రమే తీసుకున్నాం” అన్నప్పటికీ, ట్రైలర్ చూస్తే లొకేషన్లు, సన్నివేశాలు, ఫ్రేమ్స్ వరకు దాదాపు డీటో దింపినట్టే కనిపించింది.

ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే విజయ్ యాంటీ ఫ్యాన్స్‌తో పాటు నందమూరి అభిమానులు జననాయకంను తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బాలకృష్ణ చేసిన పాత్రకు ఏజ్‌కు తగ్గ గంభీరత, వెయిట్ ఉంటే, అదే క్యారెక్టర్‌ను విజయ్ హుందాతనం లేకుండా.. అల్లరి-చిల్లరి టచ్‌తో చేశాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విజయ్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ పరిమితమే కావడంతో.. “మళ్ళీ భగవంత్ కేసరినే ఎందుకు చూడాలి?” అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికితోడు తెలుగు ట్రైలర్‌ను భగవంత్ కేసరితో పోల్చి చూడటంతో విజయ్ సోషల్ మీడియాలో కామెడీ పీస్ అయ్యాడన్న వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి.

భగవంత్ కేసరి ఒక్కసారిగా ట్రెండ్:
ట్రైలర్‌తో జననాయకం భగవంత్ కేసరికి రీమేక్ అన్న క్లారిటీ రావడంతో.. సోషల్ మీడియాలో వరుస పోస్టులు, మీమ్స్, కామెంట్స్ వచ్చాయి. దాంతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న భగవంత్ కేసరిని తమిళ ప్రేక్షకులు ఎగబడి చూడటం మొదలుపెట్టారు. ఫలితంగా సినిమా అమెజాన్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఇదే ఇప్పుడు జననాయకుడు మేకర్స్‌ను టెన్షన్‌కు గురి చేస్తోంది.

Steve Smith History: రికార్డులు తిరగరాసిన స్టీవ్ స్మిత్.. హాబ్స్‌, సచిన్, ద్రవిడ్ రికార్డ్స్ బ్రేక్!

సినిమా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈలోగా అమెజాన్‌లో భగవంత్ కేసరి ట్రెండ్ కొనసాగితే తమిళ ఆడియన్స్ కథ మొత్తం ముందే చూసేసే ప్రమాదం ఉంది. అలా అయితే థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉండదని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. విజయ్ ఫ్యాన్స్ ఎలాగో సినిమా చూస్తారు. కానీ ఇద్దరు సినిమాలను పోల్చి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే, ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్నది అసలు భయం.

Exit mobile version