Bhagavanth kesari : వర్షం కారణంగా నిలిచిపోయిన బాలయ్య సినిమా షూటింగ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి.. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటి శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తుంది.తాజాగా భగవంత్ కేసరి సినిమా షూటింగ్ గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నిలిచి పోయినట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. గత వారం బాలకృష్ణ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు.కానీ ఇప్పుడు ఆయన లేకుండా శ్రీ లీల,కాజల్ కాంబో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ఈనెల 25వ తేదీ వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరగాల్సి ఉందని తెలుస్తుంది.. కానీ రెండు రోజుల పాటు వర్షాల కారణంగా షూటింగ్ నిలిచి పోయిందని సమాచారం.దాంతో అనుకున్న సమయంకు ఈ సినిమా పూర్తి అయ్యే పరిస్థితి లేనట్లు కనిపిస్తుంది.
ఆగస్టు మొదటి వారంలో మళ్లీ బాలయ్య, శ్రీ లీల, కాజల్ కాంబోలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ఇప్పుడు వర్షం కారణంగా షూటింగ్ క్యాన్సల్ అవ్వడంతో ఆ షెడ్యూల్ కూడా ఆగి పోయే పరిస్థితి ఏర్పడింది…ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ నేపథ్యం లో సినిమాకి వర్షం కారణంగా సినిమా షూటింగ్ లేట్ అవుతుంది. దీనితో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా అని బాలయ్య అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమా ను ఫుల్ యాక్షన్ సినిమాగా రూపొందిస్తున్న విషయం తెల్సిందే.బాలయ్య పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ మరియు టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.టీజర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!