Bhagavanth Kesari : అనుకున్న డేట్ కే బాలయ్య వచ్చేస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నట సింహం నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీ కోసం బాలయ్య అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు… భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య కూతురి పాత్రను శ్రీలీల చేస్తున్నారని సమాచారం. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తున్నారు.ఫుల్ మాస్ యాక్షన్ మూవీ గా భగవంత్ కేసరి తెరకెక్కింది.టీజర్లో తెలంగాణ యాసలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‍లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, భగవంత్ కేసరి మూవీ రిలీజ్ వాయిదా పడుతుందనే ఇటీవల రూమర్లు బాగా వచ్చాయి. అయితే తాజాగా అనుకున్న సమయానికే ఈ మూవీ వస్తుందని తెలుస్తుంది.
భగవంత్ కేసరి చిత్రాన్ని అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, ఆంధ్రప్రదేశ్‍లో ఏర్పడిన రాజకీయ పరిణామాల వల్ల బాలకృష్ణ పొలిటికల్ గా బిజీగా ఉండటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ కొన్ని రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి.అయితే, అక్టోబర్ 19వ తేదీనే భగవంత్ కేసరిని రిలీజ్ చేసేలా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.మరో మూడు రోజుల్లో భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ పనులను సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పూర్తి చేస్తున్నారు.. మొత్తంగా ముందు ప్రకటించిన విధంగానే భగవంత్ కేసరి మూవీ దసరా మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది
Also Read
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
తాజావార్తలు
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్‌తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!