NTV Telugu Site icon

Bihar : చికెన్ మసాలా కొనేందుకని వెళ్తే… కిడ్నాప్ చేసి హోంగార్డుకు పెళ్లి చేశారు

New Project (49)

New Project (49)

Bihar : బలవంతపు పెళ్లిళ్ల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ పెళ్లిళ్లలో అమ్మాయిలనే ఎక్కువగా బలవంతం చేసి పెళ్లిళ్లు చేస్తుంటారు. అమ్మాయి ఇష్టం లేకపోయినా కిడ్నాప్ చేసో లేక బెదిరించో పెళ్లి చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో అబ్బాయిలను కూడా కిడ్నాప్ చేసి పెళ్లిళ్లు చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అబ్బాయి అనుమతి లేకుండానే తప్పని సరి పరిస్థితుల్లో అమ్మాయి మెడలో తాళి కట్టాల్సి వస్తుంది. బీహార్  రాష్ట్రంలో తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. భాగల్‌పూర్‌లో షాపుకని వెళ్తే అక్కడ హోంగార్డును కిడ్నాప్ చేశారు. ఆపై కిడ్నాపర్లు అతన్ని 100 కిలోమీటర్ల దూరంలోని పూర్నియాకు తీసుకెళ్లారు. అక్కడ అతడికి బలవంతంగా పెళ్లి జరిపించారు.

ఈ ఘటన నవాడా సమీపంలో చోటుచేసుకుంది. బాధితుడు, హోంగార్డు సుమిత్ కుమార్, నవ్‌గాచియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సకుచా నివాసి. సుమిత్ సోదరుడు వీరేంద్ర ఫిర్యాదు పై నవ్‌గాచియా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సుమిత్ హోంగార్డు శిక్షణ పూర్తి చేసుకున్నాడని, సోమవారం నుంచి నవ్‌గాచియా పోలీస్ స్టేషన్‌లో చేరాల్సి ఉందని చెప్పాడు. అయితే అంతకుముందే అతడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు.

Read Also:AP NDA Leaders: శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక.. గవర్నర్కు లేఖ

సుమిత్ ఏమయ్యాడు?
వీరేంద్ర మాట్లాడుతూ.. ‘నా సోదరుడు సుమిత్‌ తన కజిన్‌ ప్రభాస్‌ కుమార్‌తో కలిసి బైక్‌పై జగత్‌పూర్‌లోని తన మేనమామ గౌతమ్‌ యాదవ్‌ ఇంటికి వెళ్లాడు. సుమిత్ దగ్గర తన మేనమామ లక్ష అప్పు చేశాడు. వాటిని వసూలు చేసేందుకు వెళ్లాడు. మామ డబ్బుతో పాటు రెండు కోళ్లను కూడా ఇచ్చాడు. సుమిత్ ఇంటికి వెళ్లి చికెన్ వండుకుంటానని అనుకున్నాడు. దీంతో బైక్‌ను దారిలో ఆపేశాడు. చికెన్ మసాలా కొనడానికి షాప్ వైపు వెళ్లాడు. అప్పుడు స్కార్పియోలో వచ్చిన కొందరు వ్యక్తులు తుపాకీతో సుమిత్‌ను బెదిరించి బలవంతంగా కారులో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. కిడ్నాపర్లలో గోపాల్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడు. సుమిత్‌ను పూర్ణియ వద్దకు తీసుకెళ్లి గోపాల్ యాదవ్ కుమార్తెతో బలవంతంగా పెళ్లి చేశారు. ఈ క్రమంలో సుమిత్‌తో పాటు అతడి బంధువులను కూడా కొట్టారు.

పెళ్లి చేసి పారిపోయారు
పెళ్లి తర్వాత సుమిత్‌ను మార్గమధ్యంలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సుమిత్ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నాలుగు గంటల తర్వాత సుమిత్, అతని సోదరుడు కోలుకున్నారు. ఈ కేసులో ధోబినియాకు చెందిన గోపాల్ యాదవ్, రోహిత్ యాదవ్, భిలి కుమార్, అశ్వని కుమార్‌లను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితులందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సుమిత్‌కి ప్రధమ చికిత్స నిర్వహించారు.

Read Also:MP: పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 10 కి.మీ మేర వ్యాపించిన పొగలు