Site icon NTV Telugu

AP and Telangana Elections: ఏపీ, తెలంగాణ ఎన్నికలు..! అప్పుడే బెట్టింగ్‌ల జోరు..

Betting

Betting

AP and Telangana Elections: తెలంగాణ రాజకీయాలపై బెట్టింగ్ రాయుళ్లు.. అప్పుడే పందేలు మొదలుపెట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార బీఆర్ఎస్.. కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ పొలిటికల్ యాక్టివిటీని పెంచేశాయి. తెలంగాణలో ఎన్నికల హీట్ వచ్చేసిందనే టాక్ మొదలైంది. దీంతో పందెం రాయుళ్లు.. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపై బెట్టింగ్ లు కట్టడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లోనే కాదు..ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా పందేలు కాస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దీనికి తోడు బిజెపి అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అధికార పార్టీ కూడా టెన్షన్ లోకి వచ్చిందన్న ఫీలింగ్ కనబడుతోందన్న చర్చ జరుగుతోంది. వీటన్నిటితో తెలంగాణలో గెలిచేది ఎవరు అనే అంశంపై బెట్టింగ్ కాస్తున్నారు. అధికార బీఆర్ఎస్ కు 65 సీట్లు వస్తాయని కొందరు బెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పై అనూహ్యంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 45 సీట్లు వస్తాయని కొందరు, 35 నుంచి 40 సీట్లు వస్తాయని మరికొందరు పందెం వేస్తున్నారు. ఎక్కువమంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 40 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని లక్షల్లో బెట్ చేస్తున్నారు. ఇక బీజేపీ 12 సీట్లలోపే పరిమితం అవుతుందని కాయ్ రాజా కాయ్ అంటున్నారు.

డిసెంబర్‌లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుచే బెట్టింగ్ కాస్తున్నారు. ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగి చూసే ధోరణిలో బెట్టింగ్ కడుతున్నారు. ఎన్నికలకు ఐదారునెల ముందే ఇలాంటి బెట్ కాస్తే… ఎన్నికలు దగ్గర పడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపైనా బెట్టింగ్ మామూలుగా లేదు. పొత్తులు కుదరలేదు, తెలంగాణతో పోలిస్తే సమయం ఇంకా చాలా వుంది…అయినా ఏపీపైనా ఒక రేంజ్ లో బెట్టింగ్ సాగుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 75 నుంచి 81 సీట్లు వస్తాయని పందెంరాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. అలాగే టీడీపీకి 65 నుంచి 70 స్థానాలు వస్తాయని పందెం వేస్తున్నారు. జనసేనకు 15 నుంచి 20 సీట్లు వస్తాయని బెట్టింగ్ కు సై అంటున్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హీట్ పెరగడంతో, బెట్టింగ్ జోరు కూడా మొదలైపోయింది.

Exit mobile version