Site icon NTV Telugu

Betting Apps : బెట్టింగ్ యాప్స్ పై కొనసాగుతున్న పంజాగుట్ట పోలీసుల విచారణ..

Vizag Cricket Betting

Vizag Cricket Betting

Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై ఇప్పటికే కేసులు నమోదు చేసి నోటీసులు అందించారు పోలీసులు.యాంకర్ విష్ణుప్రియ మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆమెకు అందించిన నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కాగా మంగళవారం విచారణకు విష్ణుప్రియ హాజరుకాలేదు. అలాగే ఈ రోజు మరి కొంత మంది ఇన్‌ఫ్లుయన్సర్లు, ప్రమోటర్ లకు నోటీసులు జారీ చేయనున్నారు పోలీసులు. నటి మంచు లక్ష్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిలిస్ట్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కేసులు నమోదైన నటీనటులు తమ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. మరికొందరు తాము తెలియక ప్రమోట్ చేశామంటూ తమ సోషల్ మీడియా అకౌంట్‌లలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసు వివరాలను పంజాగుట్ట పోలీసుల నుండి ఈడి తీసుకుంది. ఈడి ఎంటర్ కావడంతో కేసులు నమోదైన వారిలో ఆందోళన నెలకొంది. ఏ రోజు తమకు నోటీసులు వస్తాయో ఎప్పుడు తమని అరెస్ట్ చేస్తారేమోనని బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ లో భయం నెలకొంది.

IPL 2025: ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్‌ హాట్ భామ.. ఈసారి 13 వేదికల్లో.. !

Exit mobile version