NTV Telugu Site icon

Best Companies In US: పని చేసేందుకు ఫర్‎ఫెక్ట్ కంపెనీలు ఇవే

Company

Company

Best Companies In US: డబ్బు విషయం పక్కపెడితే.. చేసే పనిలో ఇష్టం, మానసిక ప్రశాంతత ఉండాలని ప్రతీ ఉద్యోగి కోరుకుంటారు. అలాగే కోట్లు సంపాదించినా ఆరోగ్యం పాడైతే తిరిగి తెచ్చుకోలేము. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే పని చేయడానికి అత్యంత అనుకూలమైన కంపెనీలపై కొన్ని సర్వేలు నిర్వహించాయి. అమెరికాలో నిర్వహించిన ఈ సర్వేల్లో పని చేయడానికి అత్యంత అనుకూలమైన అమెరికన్ కంపెనీలు ఏవని ఆయా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించారు.

Read Also: Rotten Coconut Business: బుర్రుండాలే కానీ.. తేలిగ్గా బిలియనీర్ కావొచ్చు

ఇప్పటివరకు అందరూ గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్ పని చేసేందుకు అత్యంత అనుకూల కంపెనీలే అనుకున్నారు… కానే కాదు. మనకు అంతగా తెలియని టెక్నాలజీ కంపెనీ గెయిన్ సైట్. మన అందరికీ తెలిసిన గూగుల్ పని చేసేందుకు అనుకూల కంపెనీల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. గ్లాస్ డోర్ అనే అమెరికన్ వెబ్ సైట్ 2023 సంవత్సరానికి గాను పనిచేయడానికి అనుకూలమైన టాప్ 100 యూఎస్ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఆయా కంపెనీల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని, వాటి ఆధారంగా కంపెనీలకు రేటింగ్, ర్యాంక్ లను గ్లాస్ డోర్ కేటాయించింది.

Read Also: PM Security Breach: భద్రతా ఉల్లంఘన.. ప్రధాని మోదీ దగ్గరగా వెళ్లిన వ్యక్తి..

పని చేయడానికి అత్యుత్తమమైన టాప్10 అమెరికా బడా కంపెనీల్లో.. 4.7 రేటింగ్ తో గెయిన్ సైట్ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాత నిలిచిన 9 కంపెనీలకూ 4.6 రేటింగ్ వచ్చింది. బాక్స్, బెయిన్ అండ్ కంపెనీ, మెకిన్సే అండ్ కంపెనీ, ఎన్విడియా, మ్యాథ్ వర్క్స్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గూగుల్, సర్వీస్ నౌ, ఇన్ ఎన్ అవుట్ బర్గర్ ఉన్నాయి. టాప్ 10 చిన్న అనుకూలమైన కంపెనీల్లో 4.7 రేటింగ్ తో గుడ్విన్ రిక్రూటింగ్ నిలిచింది. రెండో స్థానంలో ఉన్న టెలీమైండ్ కూడా 4.8 రేటింగ్ దక్కించుకుంది. తర్వాత జేజే టైలర్, పరివెడా, ఐరన్ క్లాడ్, క్వాలిఫైడ్, క్యాప్టివా టెల్ క్యూ, షెల్ మ్యాన్, ఈవెర్ లా, బార్బర్ నికోలస్ ఐఎన్ సీ ఉన్నాయి.