Site icon NTV Telugu

Winter Tips : చలికాలంలో జలుబు తగ్గేదెలా?.. ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

Tip For Cold

Tip For Cold

సీజన్‌ మారినప్పుడల్లా మనకు జలుబు చేయడం, వారం, పది రోజుల పాటు జలుబుతో అవస్థలు పాడడం మనందరికీ అనుభవమే. మిగతా సీజన్‌లో ఎలా ఉన్నా చలికాలంలో మాత్రం చీటికి మాటికి జలుబు చేస్తూ ఉంటుంది. చల్లటి వాతావరణం మూలంగా జలుబు ఒకపట్టాణ తగ్గదు. పిల్లల్ని మరీ ఏడిపిస్తూ ఉంటుంది. శీతాకాలంలో వేధించే జలుబు బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : #TelanganaNotForSale: ట్రెండింగ్‌ లో తెలంగాణ నాట్‌ ఫర్‌ సేల్‌..

చలికాలంలో వణికించిన చలి మూలంగా మనం శ్వాస వ్యవస్థకు సమస్యల బెడద పెరుగుతూ ఉంటుంది. చాలా తరచుగా జలుబు, దగ్గు, తుమ్ములు, కఫం వంటి బాధలు వేధిస్తూ ఉంటాయి. ఈ సీజన్‌లో తరచూ వేధించే జలుబును మాత్రం అశ్రద్ధ చేయకూడదు. సాధ్యమైనంత త్వరగా జలుబు తగ్గిపోయేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే జలుబు చాలా సందర్భాల్లో బ్రాంకైటిస్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో జలుబు, బాధల్ని త్వరగా తగ్గించుకునే అందుకు పావు స్పూన్ మిరియాల పొడిని తేనెతో కలిపి తరచూ తీసుకోండి.

వేడి నీటిలో పసుపు పొడి వేసుకొని ఆవిరి పట్టండి. నీటిలో అల్లం ముక్కలు ఉడకబెట్టి వడ కట్టుకొని కొద్దిగా చక్కెర వేసుకుని వేడిగా తాగితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. మిరియాలు, ధనియాలు రెండింటిని కలిపి కషాయం గా కాచుకొని తాగితే కూడా.. జలుబు, దగ్గు నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. తేనెలో అల్లం కలుపుకొని తరచూ చప్పరిస్తూ ఉంటే జలుబు బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

Exit mobile version