నడుము, తొడల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. మనం లావుగా ఉన్నామన్న విషయం ఈ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు పదే పదే గుర్తు చేస్తుంది. మన శరీర ఆకృతిని అసహ్యంగా మారుస్తుంది. ఇలా భారీగా పెరిగిన కొవ్వుని కరిగించుకోవడానికి మంచి చిట్కాల కోసం ఆలోచిస్తుంటారు చాలా మంది. అయితే వ్యాయామం చేయడం ద్వారానే ఇటువంటి భాగాలల్లో పేరుకుపోయిన కొవ్వుని కరిగించు కోవడం సాధ్యం అవుతుంది. కానీ దీనికోసం టైం కేటాయించాల్సి ఉంటుంది. పైగా రెగ్యులర్ గా ఉదయం లేదా సాయంత్రం షెడ్యూల్ గా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అయితే.. అటువంటి వారు బెంగ లేకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలతో తొడలు, నడుము, పిరుదులులో పేర్కొన్న కొవ్వుని కరిగించు కోవచ్చు. మన వంటింటి ఓ పదార్థంతో ఒంట్లో ఉన్న కొవ్వును చాలా ఈజీగా కరిగించు కోవచ్చు అని ఇటీవల పరిశోధనాత్మకంగా కూడా కనిపెట్టారు నిపుణులు. దీనికోసం పాటించాల్సిన వంటింటి చిట్కాలు ఒకసారి చూద్దాం..
Also Read : చలికాలంలో ప్రయాణమా.. అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే..!
అల్లం ప్రతి వంట ఇంట్లో ఖచ్చితంగా ఉపయోగించే వస్తువు ఇది. వేగంగా కొవ్వును కరిగిస్తుంది అని కూడా చాలా మందికి. అంతే కాదు ఇందులోని అద్భుత ఔషధ గుణాలు అధిక బరువు కారణంగా తలెత్తే రుగ్మతలను సైతం నివారిస్తాయి. అల్లంతో పాటించే చిట్కాలతో ముఖ్యంగా నడుము, తొడలు, పిరుదుల చుట్టూ పేర్కొన్న కొవ్వును తేలికగా కరిగించు కోవచ్చు. అల్లంలో ఉండే జింజర్ అనే పదార్ధం మన శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీనివల్ల కొవ్వు కరిగిపోతుంది. అలాగే పొట్టలో పీహెచ్ లెవల్స్ పెంచడంలో అల్లం సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే అలా మన శరీరంలో మెటబాలిక్ రేట్ పెంచడంలో సహాయపడుతుంది. మెటబాలిజమ్ పెరిగితే బరువు త్వరగా తగ్గిపోవచ్చు. దీనికోసం అల్లం వాటర్‌ను ఎలా తయారు చేసుకొని వాడాలో చూద్దాం.
ముందుగా ఒక లీటర్ నీటిని తీసుకొని మరిగించాలి. ఒక అల్లం తీసుకొని శుభ్రం చేసి చిన్న ముక్కలు ముక్కలుగా చేసి నీటిలో వేయాలి. ఐదు నిమిషాల దాకా అలానే ఉంచాలి. తరువాత నీటిని వడపోసి చల్లార్చి తాగాలి. ఈ నీటిని రోజంతా మామూలు వాటర్ లాగా తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారం రోజులు క్రమం తప్పకుండా ఉదయం వేళ చేస్తే అనూహ్యమైన ఫలితం కనిపిస్తుంది. అయితే శరీరంలో ఉన్న కొవ్వు అధిక బరువును బట్టి, కనీసం నెల రోజులైనా చిట్కాను క్రమం తప్పకుండా ఆచరిస్తే కొవ్వు మొత్తం పోయి నాజుగ్గా తయారు కావచ్చని ఆయుర్వేద నిపుణులు భరోసా ఇస్తున్నారు. అంతే కాదు అల్లం చాలా ఔషద గుణాల గని. ఎన్నో రకాల వ్యాధులను మన శరీరం నుంచి తరిమి కొడుతుంది. పైన చెప్పిన రెమెడీని పాటిస్తే అల్లం అధిక కొవ్వుని కరిగించడంలో మిరాకిల్‌గా పని చేస్తుందని మీరే అంటారు.