వీలైనంతవరకు పొద్దున్నే బయలుదేరడం మేలు. చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది.

కానీ ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. విమానం లేదా రైలు ఆలస్యం అయినప్పటికీ ఏ అర్ధరాత్రి పూటో చిక్కుకుపోకుండా ఉంటారు.

మీరు బయలుదేరేముందే అక్కడి వాతావరణం ఎలా ఉందో ముందుగానే కనుక్కోండి. పొగమంచు ఎలా ఉండబోతుందనేది ముందుగానే వాతావరణ వివరాల్లో తెలుసుకోండి.

ఎయిర్‌లైన్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉండండి.

చాలా రకాల ఎయిర్‌లైన్స్ వాటి అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటాయి. వీటిని ఫాలో కావడం వల్ల ముందుగానే వివరాలు తెలుసుకోవచ్చు.

ప్యాకింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అన్నీ పెట్టుకోండి. సబ్బు, టూత్‌బ్రష్, దువ్వెన, టవల్ లాంటివి పైకి, సులువుగా దొరికేలా సర్దుకోండి.

చలికాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల అవకాశమూ ఉంటుంది.

కాబట్టి బేసిక్ మందులు అంటే జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి లాంటి వాటికి సంబంధించిన మందులు తప్పనిసరిగా తీసుకెళ్లండి.

డయాబెటిస్ లాంటి జబ్బులుంటే మీ మందుల కిట్ తీసుకెళ్లడం అస్సలు మరవొద్దు.

స్వెట్టర్లతో పాటుగా బ్లాంకెట్ కూడా అదనంగా తీసుకెళ్లండి.