NTV Telugu Site icon

Best CNG Cars Under 10 Lakh: ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. బెస్ట్ సీఎన్‌జీ కార్స్ ఇవే!

Best Mileage Cng Cars

Best Mileage Cng Cars

Cheap and Best Mileage CNG Cars Under 10 Lakh 2023 in India: రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు కారణంగా భరత్ మార్కెట్‌లో సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సీఎన్‌జీ కార్లు క్రమంగా భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ కంపెనీలు అన్ని సీఎన్‌జీ కార్లను రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాయి. మీరు చౌకైన సీఎన్‌జీ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే.. చాలా కార్లు మార్కెట్‌లో ఉన్నాయి. అయితే చౌకైన సీఎన్‌జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ జాబితాను ఓసారి చూద్దాం.

Hyundai Exter CNG Price and Mileage:
హ్యుందాయ్ కంపెనీ ఇటీవలే ఎక్స్‌టర్‌ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసింది. ఇందులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. ఎక్స్‌టర్‌ ఎస్‌యూవీ ధర రూ. 8.24 లక్షల నుంచి రూ. 8.97 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సీఎన్‌జీ మోడ్‌పై 68 Bhp మరియు 95 Nm ఉత్పత్తి చేసే 1.2-లీటర్ ద్వి-ఇంధన పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ కారు మైలేజ్ 27.1 km/kg.

Maruti Suzuki Fronx CNG Price and Mileage:
మారుతీ సుజుకి ఫ్రాంక్స్ ఎస్-సీఎన్‌జీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.42 లక్షల నుంచి రూ. 9.28 లక్షల మధ్య ఉంటుంది. ఇది 1.2-లీటర్ ద్వి-ఇంధన పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 76.5 Bhp మరియు 98.5 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ ఉంటుంది. ఈ కారు మైలేజ్ 28.51 km/kg.

Also Read: Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్‌.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్!

Maruti Brezza CNG Price and Mileage:
మారుతి సుజుకి బ్రెజా ఎస్-సీఎన్‌జీ 1.5-లీటర్ ఆస్పిరేటెడ్ ద్వి-ఇంధన పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని ఇస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో ఇది 86.7 Bhp మరియు 121 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బ్రెజా ఎస్-సీఎన్‌జీ ధర రూ. 9.24 లక్షల నుంచి రూ. 12.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ కారు మైలేజ్ 25.51 km/kg.

Tata Punch CNG Price and Mileage:
టాటా పంచ్ సీఎన్‌జీ ఇంకా రిలీజ్ కాలేదు. కంపెనీ త్వరలో దీనిని ప్రారంభించవచ్చు. టాటా ఆటో ఎక్స్‌పో 2023లో కూడా టాటా కంపెనీ ప్రదర్శించింది. ఇది 1.2-లీటర్ ద్వి-ఇంధన పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. దీని ధర సుమారు రూ.7 లక్షలు ఉండవచ్చని అంచనా. ఈ కారు మైలేజ్ 26.49 km/kg అని తెలుస్తోంది.

Also Read: Funny Cricket Video: బంతి ఇవ్వనన్న బ్యాటర్.. వెంటపడిన కీపర్! వీడేమో చూస్తే అస్సలు నవ్వాగదు