NTV Telugu Site icon

Smartphones Under 25000: 25 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు.. టాప్ 5 జాబితా ఇదే!

Smartphones Under 25000

Smartphones Under 25000

Best 5G Smartphones Under 25000 in India: భారత మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. ఇందులో హై బడ్జెట్ నుంచి లో బడ్జెట్ వరకు ఉన్నాయి. అయితే 25 వేల రూపాయలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ దాదాపు 25 వేల రూపాయలు అయితే.. మంచి స్మార్ట్‌ఫోన్‌లు కొనేసుకోవచ్చు. టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో Samsung Galaxy M34 5G, Oppo F23 5G, Realme Narzo 60 Pro వంటి ఫోన్‌లు ఉన్నాయి. అమెజాన్‌లో ఈ ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Samsung Galaxy M34 5G Price, Offers:
శాంసంగ్‌ గెలాక్సీ ఎం34 స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 120Hz అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ నో-షేక్ కెమెరా మరియు 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. అమెజాన్‌లో ఫ్లాట్ 19% తగ్గింపు ఉంది. దాంతో ఈ ఫోన్ ధర రూ. 20,999లుగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై రూ. 2,000 తగ్గింపు ఉంది. దాంతో ఈ ఫోన్ రూ.18,999కి వచ్చేస్తుంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Realme Narzo 60 Pro Price, Offers:
రియల్‌మీ నార్జో 60 ప్రో ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 120Hz సూపర్ అమోలెడ్‌ కర్వ్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ మరియు 100MP OIS కెమెరా ఉన్నాయి. అమెజాన్‌లో దీని ధర రూ. 23999లుగా ఉండగా.. 11% తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ రూ. 21650కు అందుబాటులో ఉంది.

Redmi K50i 5G Price, Offers:
రెడ్‌మీ కే50ఐ 5G ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. క్విక్ సిల్వర్ కలర్, ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్ మరియు 144Hz లిక్విడ్ FFS డిస్‌ప్లే ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ అమెజాన్‌లో 34% తగ్గింపుతో లభిస్తుంది. దీని ధర రూ. 20999గా ఉంది. బ్యాంక్ మరియు ఎక్స్‌ఛేంజ్‌ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

Also Read: Rohit Sharma Test Record: 146 ఏళ్ల టెస్ట్ చరిత్ర.. ‘ఒకే ఒక్కడు’గా రోహిత్ శర్మ!

Oppo F23 5G Price, Offers:
ఒప్పో ఎఫ్23 5G 5000mAh బ్యాటరీ, 67W సూపర్ వూకే ఛార్జర్, 64MP ట్రిపుల్ AI కెమెరా మరియు 6.72 ఫుల్‌హెచ్‌డి ప్లస్ 120Hz డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్‌లో 14% తగ్గింపుతో లభిస్తుంది. అంటే రూ. 24,999 ధరతో మీ సొంతం అవుతుంది.

OnePlus Nord CE 3 Lite 5G Price, Offers:
వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ 3 లైట్ 5జీలో 1.5K రిజల్యూషన్ మరియు 120Hz డిస్‌ప్లే ఉంది. 6.74 అంగుళాల పరిమాణంలో అమోలెడ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ఉంది. భారతదేశంలో ఈ ఫోన్ ధర రూ. 21,999గా ఉంది. ఈ ఫోన్ ఇటీవల 17,999కి కూడా అందుబాటులోకి వచ్చింది.

Also Read: Lectrix EV Scooter Launch: ఎథర్‌, ఓలాకు పోటీగా.. మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!