Site icon NTV Telugu

Benin: మరో ఆఫ్రికన్ దేశంలో తిరుగుబాటు.. సైన్యం చేతిలోకి పవర్..

Benin

Benin

Benin: ఇటీవల కాలంలో పశ్చిమ ఆఫ్రికాలోని అనేక దేశాలు తిరుగుబాట్లకు గురయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో ఆఫ్రికన్ దేశం బెనిన్ కూడా చేరింది. ఆదివారం దేశ సైనికుల బృందం అకస్మాత్తుగా అధికారిక టీవీ ఛానెల్‌లో ప్రత్యక్షం అయ్యి ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. “మిలిటరీ కమిటీ ఫర్ రీఫౌండేషన్” అని ఆ సైనిక బృందం తమను తాము పిలుచుకుంటూ, దేశ అధ్యక్షుడిని, అన్ని రాజ్యాంగ సంస్థలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సైన్యం దేశానికి కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ కల్నల్ పాస్కల్ టిగ్రిని నియమించింది.

READ ALSO: Zepto Order: జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన మహిళ.. రూ. 24 రిఫండ్ కోసం ప్రయత్నిస్తే రూ.87,000 పోయినయ్

1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి బెనిన్‌ అనేక తిరుగుబాట్లను చవిచూసింది. వాస్తవానికి ఈ దేశంలో 1991 నుంచి రాజకీయ స్థిరత్వం నెలకొంది. అధ్యక్షుడు ప్యాట్రిస్ టాలోన్ 2016 నుంచి అధికారంలో ఉన్నారు. ఆయన వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీవిరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన వారసుడు, మాజీ ఆర్థిక మంత్రి రొమువాల్డ్ వడాగ్ని ఎన్నికల్లో ముందంజలో ఉన్నారు. ప్రతిపక్ష అభ్యర్థి రెనాడ్ అగ్బోజో తగినంత మద్దతు లేకపోవడంతో ఎన్నికల సంఘం ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. గత నెలలోనే పార్లమెంటు అధ్యక్ష పదవీకాలాన్ని ఐదు నుంచి ఏడు సంవత్సరాలకు పొడిగించింది. అయితే బెనిన్ జరిగిన తాజా తిరుగుబాటు రాజకీయాల్లో ఒక ప్రధాన మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. గత వారం గినియా-బిస్సావులో కూడా సైనిక అధికార మార్పిడి జరిగింది. ఎన్నికల ఫలితాలపై వివాదం మధ్య అధ్యక్షుడు ఉమారో ఎంబాలో పదవీచ్యుతుడయ్యాడు.

READ ALSO: Saudi Arabia: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు పచ్చజెండా ఊపిన ముస్లిం దేశం..

Exit mobile version