Site icon NTV Telugu

RCB vs KKR: బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సజావుగా సాగేనా?

Rcb Vs Kkr Match Rain

Rcb Vs Kkr Match Rain

భారత్‌, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 2025.. నేడు పునః ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఈరోజు రాత్రి 7:30లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న కేకేఆర్‌కు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది.

Also Read: Tirupati Gangamma Jatara: తిరుపతి గంగమ్మ జాతరకు అరుదైన గౌరవం!

ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కారణంగా మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్రమాదమూ ఉందట. శనివారం మధ్యాహ్నం 1 గంటకు 25 శాతం వర్షం పడే అవకాశం ఉండగా, సాయంత్రం 5 గంటలకు 58 శాతంగా ఉండనుందని ఆక్యూ వెదర్ అంచనా వేసింది. సాయంత్రం 7 గంటలకు 71 శాతం వర్షపాతం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా. వర్షం కారణంగా టాస్ డిలే అవుతుందట. అయితే చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం ఊరట కలిగించే అంశం. వర్షం ఆగిన అర్ధ గంటలో మైదానం సిద్ధంగా ఉంటుంది. బెంగళూరులో ఇటీవలి రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version