Site icon NTV Telugu

Cab Driver Attack: మహిళను, ఆమె కొడుకును చితకబాదిన క్యాబ్‌ డ్రైవర్.. ఏం జరిగిందంటే?

Driver Attack

Driver Attack

Cab Driver Attack: ఇటీవల ఓలా, ఉబెర్ క్యాబ్‌ డ్రైవర్లు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసులు నమోదైన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా బెంగుళూరులో ఉబెర్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలు, ఆమె కొడుకుపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. తప్పు క్యాబ్‌లోకి ప్రవేశించినందుకు 48 ఏళ్ల మహిళ, ఆమె కొడుకుపై దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం బెంగళూరులోని భోగనహళ్లిలోని నివాస ప్రాంతంలో తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లాలని మహిళ క్యాబ్‌ను బుక్ చేసినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఓ మహిళ తన కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసింది. కొంతసేపటి తర్వాత క్యాబ్‌ బుక్‌ చేసిన ప్రదేశానికి చేరుకుంది. కొడుకుతో కలిసి ఆ మహిళ క్యాబ్‌లో కూర్చొని ఉండగా.. మరో క్యాబ్ ఘటనాస్థలికి వెళ్లింది. కారు కిందకు దిగేందుకు ప్రయత్నించిన మహిళ మరో క్యాబ్ ఎక్కేందుకు ప్రయత్నించింది. దీంతో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ రెచ్చిపోయి.. వివాహిత మహిళ క్యాబ్ దిగి బుక్ చేసుకున్న క్యాబ్ ఎక్కబోతుండగా డ్రైవర్ ఒక్కసారిగా క్యాబ్ ఆపి ఆ మహిళపై దాడికి పాల్పడ్డాడు. అపార్ట్‌మెంట్‌ ముందు మహిళ తలపై కొట్టిన డ్రైవర్‌ ఆమె మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. దాడిని ఆపడానికి స్థానికులు జోక్యం చేసుకోవలసి వచ్చిందని పోలీసులు తెలిపారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని మల్లేశ్వరానికి చెందిన 25 ఏళ్ల డ్రైవర్ బసవరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నిఘా కెమెరాల్లో చిక్కింది.ఈ విషయాన్ని మహిళ భర్త సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉబెర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు.

Also Read: Micromax Electric Vehicle: స్మార్ట్‌ ఫోన్లే కాదు.. ఇకపై మైక్రోమ్యాక్స్ ఎలక్ట్రిక్‌ బైక్‌లు!

మహిళ భర్త ఇలా రాశాడు. కొడుకు మెడికల్ అపాయింట్‌మెంట్ కోసం మణిపాల్ హాస్పిటల్‌ను సందర్శించడానికి భార్య ఉబెర్‌ను బుక్ చేసింది. క్యాబ్ సుమారు 11:05 గంటలకు మా నివాసానికి చేరుకుంది (డ్రైవర్: బసవరాజ్, KA26A9391). పొరపాటున తప్పు క్యాబ్‌లోకి ప్రవేశించారని గ్రహించి వెంటనే డ్రైవర్‌కి తెలియజేశారు. మరో క్యాబ్‌ రాగా.. తన కొడుకు క్యాబ్‌ దిగి మరో క్యాబ్‌ ఎక్కాడు. అయితే తన భార్య ఇంకా బయటికి వస్తుండగా డ్రైవర్ కారును వేగవంతం చేశాడని, డ్రైవర్ తన భార్య తలపై పలుమార్లు కొట్టాడని చెప్పాడు. ఆమెను రక్షించేందుకు వచ్చిన కొడుకుపై కూడా దాడి జరిగిందని చెప్పాడు. స్థానికులు అడ్డుకుని, పోలీసులకు ఫోన్‌ చేయడంతో డ్రైవర్‌ కారులో ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించాడని, కానీ సెక్యూరిటీ గార్డు గేటు వద్ద ఆపాడని చెప్పాడు. దీంతో అతడిని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించాడు. సాయం చేసిన స్థానికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version