Site icon NTV Telugu

Bengaluru Stampede: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం.. RCB, KSCA ప్రకటన..!

Bengaluru Stampede

Bengaluru Stampede

Bengaluru Stampede: ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు విషాదంగా ముగిసాయి. ఈ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మంది కి పైగా గాయపడ్డారు. స్టేడియం బయట సుమారు రెండు లక్షల మంది అభిమానులు భారీగా గుమికూడటంతో, పరిస్థితిని పోలీసులు నియంత్రించలేకపోయారు.

Read Also: Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. ఎగ్జాట్లీ ఏ సమయంలో జరిగిందంటే..?

ఈ విషాద ఘటనపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రకటనలో వారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆర్సీబీ – కేఎస్‌సీఏ, ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన బాధాకర సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: Off The Record: బీఆర్ఎస్ పార్టీకి కవిత గుడ్ బై చెప్పిందా..? ఇక ఒంటరి పోరాటమే..?

ఈ దుర్ఘటనపై సానుభూతిగా ఆర్సీబీ, మరియు కేఎస్‌సీఏ సంయుక్తంగా, ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ పరిహారం మానవ జీవితానికి మాత్రమే కాకుండా, బాధిత కుటుంబాలకు ఓదార్పుగా ఇవ్వబడుతోంది. ఇది మానవ జీవితం విలువను తూకం వేయాలనే ఉద్దేశంతో కాదు, కేవలం వారి బాధలో మేము వారి వెంట ఉన్నామని తెలియజేయడమే ఉద్దేశ్యమని ప్రకటనలో వివరించారు.

Exit mobile version