Site icon NTV Telugu

Bengaluru Stampede: తొక్కిసలాటలో అమ్మాయిల బట్టలు చింపేశారు.. లైంగికంగా వేధించారు! వీడియో వైరల్

Bengaluru Stampede Girls

Bengaluru Stampede Girls

బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద పెను పెద్ద విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్‌ కప్పును ముద్దాడిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ సంబరాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానుల మృతి, గాయాలతో చిన్నస్వామి స్టేడియం వద్ద శోకసంద్రంగా మారింది. అయితే కొందరు దుర్మార్గులు ఈ తొక్కిసలాట ఘటను అవకాశంగా తీసుకుని.. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

Also Read: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. స్పందించిన సచిన్‌!

తొక్కిసలాటను ఆసరాగా చేసుకుని కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను లైంగికంగా వేధించారని ఓ వ్యక్తి వీడియో రిలీజ్ చేశాడు. ‘నేను నా స్నేహితుడికి కాల్ చేసి మాట్లాడాను. నా ఫ్రెండ్ కజిన్ ఒకరు ఆర్సీబీ విజయోత్సవం కోసం చిన్నస్వామి స్టేడియంకు వెళ్లింది. తొక్కిసలాట సమయంలో ఆమెను కొందరు అబ్బాయిలు లైంగికంగా వేధించారు. ఆమె బట్టలు కూడా చించారు. ఇదే ఛాన్స్ అని ఎక్కడబడితే అక్కడ తాకుతూ దారుణంగా ప్రవర్తించారు. పరిస్థితులను ఉపయోగించుకుని అత్యాచారం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇది చాలా దారుణం. చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు’ అని పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version