NTV Telugu Site icon

Bengaluru Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు.. నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు

Rave Party Case

Rave Party Case

Bengaluru Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. డ్రగ్స్‌ టెస్టులో పాజిటివ్‌ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న బెంగళూరు సీసీబీ ముందు హాజరుకావాలని సినీ నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చిన 86 మందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం.. మంత్రి కారు స్టిక్కర్ వాడింది అతనే!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఏ2 అరుణ్‌ కుమార్, ఏ4 రణధీర్ బాబు పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. చిత్తూరు వాసి రణధీర్ డెంటిస్ట్‌గా పని చేస్తున్నారు. తవణంపల్లి మండలం మడవనేరికి చెందిన అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ నిరోధక చట్టం కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో జీఆర్‌ ఫామ్‌హౌస్‌ యజమాని గోపాల్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. గోపాల్ రెడ్డి విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని సీసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గోపాల్ రెడ్డి ఏ6 గా ఉన్నారు.