Man Wear Paper Bag: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వింత సంఘటనలు, ఆసక్తికర వీడియోలు బయటకు వస్తూనే ఉంటాయి. తమ టాలెంట్‌ను బయట పెడుతూ చాలా మంది సోషల్ మీడియాకు ఎక్కితే.. మరికొందరు తమ విచిత్ర ప్రవర్తన, వినూత్న ఆలోచనతో వైరల్ అవుతారు. తాజాగా అలాంటి సంఘటనే మరోకటి సోషల్ మీడియాకు ఎక్కింది. సాధారణంగా వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. నడిపే వ్యక్తే కాదు వెనకాల కూర్చుకున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలనేది ట్రాఫిక్ రూల్. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
అయినా కొంతమంది హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడరు. దీనికి వారి దగ్గర రకరకాలు కారణాలు ఉంటాయనుకోండి. కానీ హెల్మెట్ లేకుండ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే మాత్రం పర్సు ఖాళీ అవ్వాల్సిందే. అందుకే ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. పిలియన్ రైడ్ చేస్తున్న ఆ వ్యక్తి హెల్మెట్ బదులుగా పేపర్ బ్యాగ్ ధరించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు రోడ్డుపై ఈ విచిత్ర సంఘటన దర్శనం ఇచ్చింది. ఓ వ్యక్తి బెంగళూరులో పిలియన్ రైడ్ చేస్తున్నాడు.
Also Read: Blue Dosa : నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్న బ్లూ దోస వీడియో.. అద్భుతమే..
బైక్ నడిపే వాళ్లే కాదు, వెనక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలన్న నియమం ప్రకారం.. వెనక కూర్చున్న ఈ వ్యక్తి హెల్మెట్ లాంటిది పెట్టుకున్నాడు. కానీ అది హెల్మెట్ కాదు.. ఓ పేపర్ బ్యాగ్. పేపర్ బ్యాగ్‌ను తలకు పెట్టుకుని హెల్మెట్‌లా ధరించాడు. దీంతో ఇది చూసి కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు నుంచి భిన్నరకాలైన కామెంట్స్ వస్తున్నాయి. ‘ఏంటి బ్రో.. ఇలా చేస్తే ట్రాఫీక్ పోలీసు మామ నుంచి తప్పించుకోవచ్చా’, ‘బాబోయ్.. ఏంటి అతను.. పేపర్ బ్యాగ్ ధరించి హెల్మెట్‌లా ఫీల్ అవుతున్నాడే‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Helmet, what's that? 🤣🤣🤣 pic.twitter.com/8WwA8ICVfz
— ThirdEye (@3rdEyeDude) November 12, 2023