Caucasian Shepherd Dog: ధనవంతులు అరుదైన జాతి కుక్కలను ఇంట్లో పెంచుకుంటారు. వాటి కోసం వేలు, లక్షలు వెచ్చిస్తారు. ఒక్కోసారి ఎక్కడా దొరకడం లేదంటే కోట్లు కూడా కుమ్మరిస్తారు. ఇటీవల ఓ కుక్కను బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి రూ.20కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వార్త ఇప్పుడు షికారు చేస్తుంది. అరుదైన కాకాసియన్ షెపెర్డ్ (Caucasian Shepherd) జాతికి చెందినది ఈ కుక్క.
రష్యాకు చెందిన ‘కొకేషియన్ షెపర్డ్’ అనే జాతికి చెందిన కుక్క కోసం హైదరాబాద్‌కు చెందిన కన్‌స్ట్రక్టర్ బెంగళూరులోని ‘ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసొసియేషన్’ ప్రెసిడెంట్, పెట్ యజమానైన సతీష్ కెడబామ్స్‌ను సంప్రదించాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ పెట్‌కు రూ.20కోట్లు ఇస్తానంటూ యజమానికి ఆఫర్ ఇచ్చాడు. తాను ఈ ఆఫర్‌ను నిరాకరించానని, ఈ పెట్‌ను రూ.100కోట్లు ఇచ్చినా అమ్మేది లేదంటూ కి చెప్పారు. రూ.20కోట్లకు తాను కొన్నానంటూ వచ్చిన కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు.
Read Also: Robbery : రాజధానిలో బార్ ఓనర్ పై దాడి.. రూ.2కోట్లు దోపిడీ
‘రష్యాకు చెందిన ఈ కొకేషియన్ షెపర్డ్ జాతి శునకం వయసు ఏడాదిన్నర్ర, బరువు 100కేజీలు. ఇది దక్షిణ రష్యాలోని ఆర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియాలతోపాటు టర్కీలో కూడా లభిస్తుంది. చూడటానికిది ఆడ సింహం మాదిరిగా ఉంటుంది. ‘కెడబామ్స్ హైడర్’ అని ముద్దుగా పిలిచే ఈ శునకం త్రివేండ్రంలో జరిగిన ‘కెనల్ క్లబ్ కాంపిటీషన్’లో 32 మెడల్స్‌ను సొంతం చేసుకుని ది బెస్ట్ డాగ్‌గా నిలిచింది’ అని కెడబామ్స్ చెప్పారు.
Read Also: Harish Rao: ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం దారుణం
కాకాసియన్ షెపెర్డ్ జాతి కుక్కలు ముఖ్యంగా జార్జియా, అర్మేనియా, అజర్‌బైజాన్, ఒస్సేటియా, సిర్కాసియా, టర్కీ, రష్యా వంటి దేశాల్లో కనిపిస్తాయి. అమెరికన్ కెన్నెల్ క్లబ్ ప్రకారం.. పశువులను వేటాడే జంతువుల నుండి రక్షించడానికి, ఇంటి భద్రత కోసం ఈ కుక్కలను పెంచేవారు. గంభీరంగా కనిపించే ఈ కుక్కలు చాలా చురుగ్గా ఉంటాయి. డేర్ డెవిల్స్‌గా పేరున్న ఈ జాతి కుక్కలు దాదాపు 12ఏళ్లు జీవిస్తాయి.