Crime News: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. ఆడబిడ్డగా పుట్టడమే ఆ చిన్నారి చేసిన పాపం.. లైంగిక వేధింపులు ఆ 3 ఏళ్ల చిన్నారిని కూడా వదల్లేదు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.
Miracle Escape : భూమ్మీద నూకలుండడం అంటే ఇదేనేమో.. జస్ట్ మిస్
బెంగళూరులో మంగళవారం ఈ దారుణం జరిగింది. మూడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన అనంతరం హత్య చేశాడు. బాధితురాలు ఒక గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒంటరి తల్లికి చెందిన బిడ్డ. ఆ చిన్నారి తల్లి నిందితుడితో ఏడాదికి పైగా సంబంధం కలిగి ఉంది. ఆమె తన కుమార్తెతో ఒంటరిగా నివసిస్తుండగా.. రోజూ వచ్చి కలిసేవాడు. ఈ నేపథ్యంలో అతని కన్ను ఏ పాపమెరుగని ఆ చిన్నారిపై పడింది. తల్లి ఇంట్లి లేని సమయంలో ఆ చిన్నారిపై ఆ కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేసినట్లు సమాచారం. పోలీసులు ఆ కామాంధుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బెంగళూరు పశ్చిమ ప్రాంతమైన కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
