Site icon NTV Telugu

High Court: తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నాలుగు ప్రశ్నలు..!

High Court

High Court

తొక్కిసలాట ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం స్టేటస్ రిపోర్టును పరిశీలన చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తొక్కిస్లాట ఘటనపై బెంగళూరు హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఘటనపై ప్రభుత్వానికి సంబంధించి వివరాలను అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. రెండున్నర లక్షల మంది స్టేడియం వద్ద చేరుకున్నారని.. తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారని.. 56 మంది గాయాలు, 15 మంది డిశ్చార్జ్ అయ్యారని కోర్టుకు తెలిపారు. భద్రతాపరంగా అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టామని ఏజే కోర్టుకు వివరించారు. ఇంతటి భారీ స్థాయి కార్యక్రమాలు జరుగుతుంటే ఎందుకు భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని కానీ ఊహించని విధంగా ఘటన జరిగిందని అడ్వొకేట్ జనరల్ తెలిపారు.

READ MORE: Ram Mohan Naidu: మీరు ఇలాగే చేస్తే.. రానున్న రోజుల్లో ఒకే సీటుకు పరిమితం అవుతారు..

తొక్కిసలాట జరిగిన సమయంలో అంబులెన్స్ లో ఉన్నాయా? అని సీజే ప్రశ్నించారు. స్టేడియం వెలుపలే అంబులెన్స్‌లు ఉన్నాయని.. అయితే లెక్కకు మించి గాయపడిన వారు ఉండటంతోనే కాస్త సమస్య వచ్చిందని ఏజే సమాధానమిచ్చారు. మెజిస్టేరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని… 15 రోజుల్లోనే ఘటనపై నివేదికను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. స్టేడియంలోని 21 గేట్లు తెరిచారా? అని కోర్టు ప్రశ్నించింది. మొత్తం గేట్లు తెరిచామని అసలు ఎందుకు తొక్కిసలాట జరిగిందో విచారిస్తున్నామని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు…. ఇప్పటికే నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. ప్రతి విచారణను పూర్తిస్థాయిలో వీడియో రికార్డింగ్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు.

READ MORE: Joan Alexander: 88 ఏళ్ల వయస్సులో డిగ్రీ పూర్తి చేసిన బామ్మ..!

ఈ సందర్భంగా కోర్టులోని న్యాయవాది అడ్వొకేట్ జనరల్‌కు నాలుగు సూటి ప్రశ్నలు వేశారు. జరిగిన ఘటనలోని వాస్తవాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారని… నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. క్రికెటర్లకు సన్మానం చేయాలని నిర్ణయించింది ఎవరు? ఆర్సీబీ నా లేక కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నా… లేక రాష్ట్ర ప్రభుత్వామా…? రాష్ట్రం కోసం ఆడిన ఆటగాళ్లను సన్మానించడానికి రాష్ట్రానికి ఉన్న అర్హత ఏంటి? ఎందుకు అలా చేయాలని అనుకున్నారు? విధాన సౌధ, చిన్న స్వామి స్టేడియంలో రెండు చోట్ల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరమేంటి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భద్రతా పరమైన చర్యలు ఏంటి‌? ఈ ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ సమాధానాలు చెప్పాలని లాయర్ కోరారు. విచారణ అనంతరం వెల్లడిస్తామని సమాధానం చెప్పారు.

Exit mobile version