NTV Telugu Site icon

Bengaluru: జైలు నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే గ్యాంగ్‌స్టర్‌ హత్య

Bengaluru

Bengaluru

కర్ణాటక రాజధాని బెంగళూరులో హత్య ఘటనలు పెరిగిపోతున్నాయి. గత నెల రోజుల్లో మరో గ్యాంగ్ స్టర్ హత్యకు గురికావడం కలకలం రేపుతుంది. జూలై 11న గ్యాంగస్టర్ కపిలాను ఇద్దరు వ్యక్తులు నరికి చంపారు. ఇప్పుడు తాజాగా మరో హత్య ఘటన చోటు చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ మహేష్ ఎన్ అలియాస్ సిద్ధాపుర మహేష్ (33) నుశుక్రవారం సాయంత్రం హత్య చేశారు. బెంగళూరు సెంట్రల్ జైలు నుండి విడుదలైన కొద్దిసేపటికే హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది.

Pakistan: మీ పప్పులు మా దగ్గర ఉడకవు.. మా టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు..

హత్యకు గురైన మహేష్ పలు నేరాలలో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా 2021లో జరిగిన బనశంకరి మెట్రో స్టేషన్‌లో పగటిపూట దొంగతనానికి పాల్పడ్డ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే మహేష్ హత్యలో మదన్ సహచరులు విల్సన్ గార్డెన్ నాగ, డబుల్ మీటర్ మోహన్ పాత్రలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జైలు నుంచి విడుదలైన తర్వాత మహేష్‌ను తీసుకెళ్లిన కారు డ్రైవర్ ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెండు ఇన్నోవాలలో వచ్చిన ఓ ముఠా కారును దారి మళ్లించి.. ఆ తర్వాత మహేష్ ను వీధిలో నరికి చంపారు. జూలై 2021లో డజనుకు పైగా వ్యక్తులతో కూడిన ముఠా నాగాతో లింకులు కలిగి ఉన్నారని మదన్ ఆరోపించాడు. ఆ తర్వాత మదన్ ను హత్య చేశారు. ఈ కేసులో మహేశ్‌ను ప్రధాన సూత్రధారి, మరో 16 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌-3!

మదన్ హత్యకు మహేశ్‌తో ఉన్న శత్రుత్వం మూలంగానే.., మహేశ్ సహచరుడు నవీన్‌కుమార్‌ను హత్య చేస్తానని మదన్ ఒకప్పుడు బెదిరించాడని జయనగర్ పోలీసులు తమ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. మదన్ హత్య కేసులో అరెస్టయిన తర్వాత, ప్రత్యేక కేసు విచారణలో భాగంగా మహేష్ పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపగా.. అతని కాలికి గాయమైంది. అయితే మదన్ హత్య కేసులో మహేష్ ఏడాది పాటు జైలులో ఉండి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యాడు. మరోవైపు మహేష్ పాత కేసులో తిరిగి జైలుకు వెళ్లాడు. అనంతరం ఇటీవలే విడుదలైన అతన్ని దుండగులు హత్య చేశారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా దుండగుల ఆచూకీ వెతుకుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సికె బాబా తెలిపారు.

Show comments