Rare Surgery: సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వైద్యశాస్త్రంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వైద్యులు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన శస్త్రచికిత్సలు చేశారు. తాజాగా బెంగళూరులో మరో అద్భుతమైన శస్త్రచికిత్సను వైద్యులు సక్సెస్ చేశారు. ఓ బాలుడికి తెగిపోయిన మర్మాంగాన్ని తిరిగి అతికించారు. అతను మళ్లీ ఎప్పటిలాగానే జీవితాన్ని కొనసాగించొచ్చని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ శస్త్రచికిత్స వార్త వైరల్‌గా మారింది.
బెంగళూరులోని ఫోర్టీస్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తెగిపడిన మర్మాంగాన్ని ప్రత్యేక శస్త్ర చికిత్సలో తిరిగి అతికించారు. నైజీరియాలో 6 నెలల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 12 సంవత్సరాల బాలుడి మర్మాంగం పూర్తిగా తెగిపోయింది. వైద్యులు ఆపరేషన్ చేసి తిరిగి అతికించారు. ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలను యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మోహన్ కేశవమూర్తి మీడియాకు వివరించారు.
Urinates On Woman: విమానంలో మద్యం తాగి.. మహిళపై మూత్ర విసర్జన
రెండు దశల శస్త్ర చికిత్స అనంతరం మూత్ర విసర్జనకు సమస్య లేకుండా చేశామని, మూడో దశలో మూత్రనాళాలను ఏర్పాటు చేయాల్సి ఉందని వెల్లడించారు. ఆరు నెలల అనంతరం ఆ బాలుడికి మరో శస్త్రచికిత్స చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. బాలుడు పెరిగి పెద్దవాడయ్యాక వైవాహిక జీవితం గడిపేందుకు ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు.