NTV Telugu Site icon

IPL: ఐపీఎల్‌ చూడ్డం టైమ్‌ వేస్ట్‌ : స్టార్టప్ ఫౌండ‌ర్‌ తనయ్ ప్రతాప్‌

Ipl

Ipl

IPL seeing time waste : క్రికెట్‌ అంటే ఇష్టం ఉన్నవారు ఇండియన్‌ ప్రీమీయర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చూడకుండా ఉండరు. క్రికెట్‌ అభిమానులు ఎల్‌కేజీ వయసు నుంచి పండు ముసలి వరకు క్రికెట్‌ను ఆస్వాధిస్తారు. ఐపీఎల్‌ కోసం నెల రోజుల ముందు నుంచే సీజన్‌ చూడటానికి ప్లాన్‌ చేసుకుంటారు. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం అవుతుందంటే క్రికెట్‌ లవర్లు తమ వర్క్‌ ప్లాన్‌ చేసుకొని చూడటానికి షెడ్యూల్‌ పెట్టుకుంటారు. ఐపీఎల్‌ ద్వారా వేల కోట్ల రూపాయల బిజినెస్‌ జరుగుతుంది. ఇదే బెట్టింగ్‌ రూపంలో మరో రకం దందా కూడా జరుగుతుంది. ఐపీఎల్‌ ద్వారా దేశీయ క్రికెటర్ల ప్రతిభ బయటకు వస్తుంది. ఐపీఎల్‌ ద్వారా ఎన్నో వర్గాల వారి వ్యాపారాలు సాగుతున్నాయి. మొత్తంగా ఒక ఐపీఎల్‌ సీజన్‌ ద్వారా సుమారు ర. 20 వేల కోట్ల నుంచి రూ. 25వేల కోట్ల వరకు వ్యాపారం సాగుతుందనేది జగమెరిగిన సత్యం.

Read Also: Amit Shah Warning : ఆయుధాలు అప్పగించని వారికి అమిత్‌ షా సీరియస్‌ వార్నింగ్‌

అటువంటి ఐపీఎల్‌ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీజన్‌ మొదలైందంటే చాలు.. గంటల తరబడి టీవీలకు అతుక్కుపోతుంటారు. తమ అభిమాన జట్టు గెలవాలని పూజలు చేస్తుంటారు. కొందరు బెట్టింగ్‌లు పెడతారు. అయితే ఐపీఎల్‌ను చూడటమంటే సమయాన్ని వృధా చేసుకోవడమేనని బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ ఫౌండ‌ర్‌ తనయ్‌ ప్రతాప్ అన్నారు‌. ఐపీఎల్‌ చూసేందుకు వృధా చేస్తున్న టైంను కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చని సూచిస్తూ ట్వీట్‌ చేశారు. తగినంత సమయం లేదు అంటూ ప్రజలు తరచూ ఫిర్యాదు చేస్తుంటారని.. టైం లేదంటూనే వారు గంటల తరబడి ఐపీఎల్‌కు అతుక్కుపోతారు. రోజుకు నాలుగు గంటలు ఐపీఎల్‌ కోసమే గడుపుతున్నారు. అంటే కేవలం ఐపీఎల్‌ కోసం 30 రోజుల్లో 120 గంటల విలువైన తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని అన్నారు. అదే టైంను కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఉపయోగిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోండని ట్విట్టర్‌ పేర్కొన్నారు. సమయాన్ని తెలివిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించండని నెటిజన్లకు సూచన చేశారు. ఇందుకు స్పందిస్తున్న నెటిజన్లు .. ప్రతి గంటను ఏదో ఒకటి నేర్చుకునేందుకు కేటాయించలేమంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Show comments