Site icon NTV Telugu

Bengaluru: తక్కువ ఎత్తులో భారీ విమానం చక్కర్లు.. బెంబేలెత్తిన స్థానికులు

Fluitr

Fluitr

బెంగళూరు వాసులను ఓ భారీ విమానం హడలెత్తించింది. గత రెండ్రోజులుగా బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానం తక్కువ ఎత్తులోనే చక్కర్లు కొట్టింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక నగర వాసులు భయాందోళన చెందారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఏప్రిల్ 3న సాయంత్రం 5.32 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం బెంగళూరు నుంచి రాత్రి 10.54 గంటలకు తిరిగి వచ్చినట్లు డేటా వెల్లడించింది. బెంగుళూరులోని కోరమంగళ, ఇందిరానగర్ ప్రాంతం సమీపంలో ఆరు సార్లు చక్కర్లు కొట్టింది. భూమికి నిజంగా దగ్గరగా వచ్చి తాకకుండా మళ్లీ టేకాఫ్ అయిందని సోషల్ మీడియాలో స్థానికులు తెలిపారు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ప్రజలు అయోమయానికి గురయ్యారు.

ఇది కూడా చదవండి: Heatwave Alert: కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు ఇవే

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ పోర్టుపై బోయింగ్ విమానం బెంగళూరులోని కోరమంగళ, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఆరుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లింది. ఆ భారీ విమానం వచ్చి, వెళ్లే దృశ్యాలను స్థానికులు ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు వాటిని సోషల్ మీడియా షేర్ చేశారు. కే 7067 నంబర్ గల బోయింగ్ 777-337 విమానం అని తెలుస్తోంది. ఈ భారీ విమానాన్ని ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇతర వీవీఐపీల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ విమానాన్ని ఎవరు ఉపయోగించారనే సందేహం నెలకొంది.

ఇది కూడా చదవండి: PM Modi: బెంగాల్‌లో అఘాయిత్యాలను ఆపగలిగే శక్తి బీజేపీకే ఉంది

బోయింగ్ 777-337 లాంటి విమానాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రెండు ఉన్నాయి. బోయింగ్ విమానం ఢిల్లీ నుంచి బెంగళూర్ వచ్చి వెళ్లిందని తర్వాత తెలిసింది. ఇందిరానగర్‌పై కూడా చక్కర్లు కొట్టిందని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. తక్కువ ఎత్తులో విమానం రోజు వస్తుందని మరొకరు రాశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ విమానాన్ని ప్రధాని, రాష్ట్రపతి వాడటం లేదు. ఆ విమానం కండీషన్ చెక్ చేసేందుకు, లేదంటే పైలట్లకు శిక్షణ కోసం బోయింగ్ విమానాన్ని తిప్పినట్టు సమాచారం. కోరమంగళ, ఇందిరానగర్ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version