NTV Telugu Site icon

Bengaluru: మహిళపై బైక్-టాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులు.. రూట్ మార్చి, కోపరేట్ చేయాలంటూ..

Bengaluru

Bengaluru

Bengaluru: ఇటీవల కాలంలో బైక్-ట్యాక్సీ రైడర్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. రాత్రి సమయాల్లో గమ్యస్థానం వెళ్లేందుకు బైక్స్, ఆటో, కార్లు బుక్ చేసుకుంటున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూర్‌లో 28 ఏళ్ల మహిళపై ఓ ర్యాపిడో డ్రైవర్ అర్ధరాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 5న రాత్రి 11.40 గంటల నుంచి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య జరిగిందిన బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

Read Also: MP High Court: భార్య వంట చేయకపోవడం, భర్తను బట్టలు ఉతకమనడం.. ఆత్మహత్యకు కారణాలు కావు..

సర్జాపూర్ రోడ్‌లోని రాధారెడ్డి లేఅవుట్‌లో నివాసం ఉంటున్న మహిళ ఓ హోటల్‌లో స్టోర్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తోంది. అదే హోటల్‌లో ఆమె భర్త కూడా పనిచేస్తున్నట్లు బెల్లందూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి 11.20 గంటలకు ఇంటికి వెళ్లేందుకు బైక్ టాక్సీని బుక్ చేసుకున్నట్లు చెప్పారు. 20 ఏళ్ల బిస్వజిత్ నాథ్ బైక్ డ్రైవర్‌గా చెప్పింది. ఇంటికి వెళ్తున్న సమయంలో వర్షపు నీరు ఎక్కువగా ఉందని వేరే రహదారి తీసుకుంటున్నట్లు పేర్కొంటూ బిస్వజిత్ తన మార్గాన్ని మార్చాడని, ఆ సమయంలో తాను తన స్నేహితురాలితో బెంగాలీలో మాట్లాడానని, బిస్వజిత్ తనను బెంగాలీ అని అడిగి మాట కలిపినట్లు చెప్పింది. ఇంతలోనే ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అసభ్యంగా తాకుతూ కోపరేట్ చేయాలని కోరాడని, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే చెంప కొట్టాడని మహిళ పేర్కొంది.

తన మొబైల్ ఫోన్, నగదు తీసుకున్నాడని, తనను ఏం చేయొద్దని అతడిని వేడుకున్నట్లు చెప్పింది. దాదాపుగా 30 నిమిషాల పాటు ఎంతకీ లొంగలేదని, తనను ఇంటి వద్ద లేకపోతే ఏదైనా లోకేషన్ వద్ద డ్రాప్ చేయాలని కోరానని చెప్పారు. నిందితుడు తనను ఆర్ఎంజెడ్ ఎకో వరల్డ్ వద్ద దించేసి, మొబైల్ ఫోన్ ఇచ్చేసి రూ. 800 తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, అతడి బైక్ నెంబర్ నోట్ చేయలేదని, రాపిడోకి ఫిర్యాదు చేసి, అతడి పేరు బిశ్వజిత్‌గా చెప్పానని, వారు నిందితుడిని తొలగిస్తామని చెప్పారని పేర్కొంది. అతడి పేరు, నంబర్ ఇతర వివరాలు ఇవ్వడంతో అతడిపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.