NTV Telugu Site icon

Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. రీల్స్ కోసం భారీగా జనాలు

Bengal Reels

Bengal Reels

సోమవారం పశ్చిమ బెంగాల్ లోని న్యూజల్ పైగురి స్టేషన్ కు సమీపంలో కాంచన్ జంగా ఎక్స్ ప్రెస్ ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో.. 15 మంది మృతి చెందగా, 60 మందికి గాయాలయ్యాయి. అయితే.. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి జనాలు చూసేందుకు భారీగా వెళ్తున్నారు. అయితే.. వారు అక్కడ సెల్ఫీలు దిగుతూ, రీల్స్ చేస్తున్న క్రమంలో షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రాక్ పై చాలా మృతదేహాలు పడి ఉన్నాయని వారు చెబుతున్నారు.

Andhra Pradesh: రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు..

ప్రమాదస్థలికి జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో స్థానికులు నీరు, స్నాక్స్ అమ్ముతున్నారు. 15 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రదేశం ఇప్పుడు ప్రజలకు పర్యాటక కేంద్రంగా మారింది. భయంకరమైన రైలు ప్రమాదంలో చాలా మంది తమ ప్రియమైన వారిని శాశ్వతంగా కోల్పోయారు. ఈ ప్రదేశం ఇప్పుడు కొంతమందికి వినోదం, ఉత్సుకత కలిగించే అంశంగా మారింది. ప్రమాద ఘటన చూసేందుకు జనాలు చాలా కిలోమీటర్లు ప్రయాణించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా.. వందలాది మంది రీల్స్ చేస్తున్నారు. ఘటనాస్థలికి పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. స్థానికులు సైతం ఇక్కడ చిరు వ్యాపారులు చేసుకునే పరిస్థితి నెలకొంది. సమీప గ్రామాల నుంచే కాకుండా.. సూదూర ప్రాంతాలైన మతిగర, ఫుల్ బరి, బాగ్ డోగ్రా నుంచి బైక్ లు, కార్లలో పెద్ద ఎత్తున వస్తున్నారు.

Group Jobs : ఖాళీలను పెంచాలని గ్రూప్‌ ఉద్యోగాల అభ్యర్థులు ధర్నా

ఘటనాస్థలానికి వచ్చిన ఓ యువకుడు మాట్లాడుతూ.. ఇలాంటి ప్రమాదాల గురించి విన్నాను కానీ.. చూడలేదని తెలిపారు. అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పాడు. దెబ్బతిన్న జనరల్ కోచ్ పక్కన స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకున్నట్లు తెలిపాడు. మరోవైపు.. ఒక మహిళ తన ఇద్దరు కుమారులు భర్తతో బోల్తా పడిన కోచ్ వెలుపల నిలబడి ఫోటోలు తీసుకున్నారు. సంఘన స్థలానికి చేరుకోవడానికి బాగ్ డోగ్రా నుంచి వచ్చామని, ఇలాంటి దృశ్యాలు తరుచుగా కనిపించవని.. స్వయంగా చూసేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపారు. కొంతమంది వ్యక్తులు పాడైపోయిన కోచ్ ల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు.. జనాలు భారీగా వస్తుండటంతో అదుపు చేయడానికి పోలీసులకు ఇబ్బందిగా మారింది.

Show comments