chocolate steal: షాపింగ్‌మాల్‌లో చాక్లెట్లు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అవమానంతో ఒక కాలేజ్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పశ్చిమబెంగాల్ అలిపుర్దుయార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జైగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాస్ పల్లికి చెందిన ఓ యువతి డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. తాజాగా సదరు యువతి సెప్టెంబర్ 29న విద్యార్థిని తన చెల్లెలుతో కలిసి షాపింగ్‌మాల్‌కి వెళ్లింది. దీంతో దొంగిలించిన చాక్లెట్ ధర చెల్లించి, క్షమాపణలు చెప్పి అక్కడి ఉంచి వెళ్లిపోయినట్లు మృతురాలి తండ్రి తెలిపారు. కానీ ఈ సంఘటన సోషల్ మాధ్యమంలో వైరల్ అయిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. దీంతో ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఆవేదన వెలిబుచ్చాడు.
Read Also:వామ్మో టబు.. ఇన్ని ఎఫైర్లు నడిపావా
ఐతే మాల్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ సంఘటనను షాపు వారు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయించారని జైగావ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఆఫీసర్ ప్రభీర్ దత్తా వెల్లడించారు. షాపు వారు చేసిన పని వల్లే మనస్తాపం చెంది తన కూతురు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తండ్రి తెలిపారు. మృతురాలి బంధువులు, స్థానికులు షాపింగ్ మాల్ వెలుపల నిరసనకు దిగారు. వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.