Site icon NTV Telugu

Bengal Governor: ఈ నెల 26న సీఎం సమక్షంలో బెంగాల్ గవర్నర్‌కు అక్షరాభ్యాసం

Bengal Governor

Bengal Governor

Bengal Governor: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్‌కు ఈ నెల 26న అక్షరాభ్యాసం జరగనుంది!. ఈ వయస్సులో ఆయనకు అక్షరాభ్యాసం ఏంటని ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆశ్చర్యకరమైనా అది నిజమేనండోయ్..! ఈ నెల 26న సరస్వతీ పూజను పురస్కరించుకుని మమతా బెనర్జీ సమక్షంలో రాజ్‌భవన్‌లో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం పలక, బలపం పట్టి గవర్నర్ బెంగాలీ అక్షరాలు దిద్దుతారు. రాజ్‌భవన్‌లో ఆనందబోస్‌కు ఈ క్రతువు జరగనుంది.

ఆంగ్లం, హిందీ, మలయాళం భాషల్లో దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆనందబోస్ బెంగాలీలోనూ ఓ పుస్తకం రాయాలని ఆసక్తితో ఉన్నారు. బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ఆయన తన ఆసక్తిని వెలిబుచ్చారు. ఇందుకోసం బెంగాలీ భాష నేర్చుకోవాలని నిర్ణయించారు. బెంగాలీ భాషలోని అక్షరాలను నేర్చుకునే ముందు భాగంగా చిన్నారులకు ‘హతేఖోరీ’ పేరుతో నిర్వహించే సంప్రదాయ రీతిలో అక్షరాభ్యాస తంతును గవర్నర్‌కు నిర్వహిస్తారు.

Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉంది.. అలా చేస్తేనే అంతం!

ఇదిలా ఉండగా.. మాజీ ఐఏఎస్ అధికారి అయిన సీవీ ఆనందబోస్ మలయాళీ.. కాగా ఆయన ఎన్నో భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన తండ్రి వాసుదేవన్ నాయర్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఎనలేని గౌరవం. అందుకే, తన పిల్లలందరి పేర్లకూ చివర బోస్ అనే పేరు పెట్టారు.

Exit mobile version