NTV Telugu Site icon

Telia Bhola Fish: రాత్రికి రాత్రే మారిన జాలర్ల జాతకం.. ఆ ఒక్కటి వారి జీవితాన్ని మార్చేసిందిగా

Fish

Fish

Telia Bhola Fish: ఒక్కోసారి ఈ ఏడాది మనకు అస్సలు బాలేదు. కాలం కలిసి రాలేదు అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుుడే మెరుపులా భలే ఛాన్స్ దొరికితే రాత్రికి రాత్రే కష్టం తీరిపోతే సూపర్ గా ఉంటుంది కదా. అలాగే జరిగింది పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు జాలర్లకు. ఖరీదైన చేపలు దొరికి జాలర్ల జీవితం మారిపోయింది అనే వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం.ఇలాంటివి ఎక్కువ వెస్ట్ బెంగాల్ లోనే జరుగుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం చేపలకు చాలా ఫేమస్. దేశంలో ఎక్కువ చేపలు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ చాలా మంది చేపల వేటపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తారు. వీరిలో కొంతమంది వలలో కొన్ని ఖరీదైన చేపలు పడి రాత్రికి రాత్రే వారి జీవితాన్ని మార్చేస్తాయి. తాజాగా మళ్లీ అలానే వెస్ట్ బెంగాల్ లోని కొంతమంది జాలర్ల జీవితం మారిపోయింది.

Also Read: Sunday: ఆదివారం పుట్టిన వారి లక్షణాలు.. ఆ ఒక్కటే వారిలో మైనస్

సాధారణంగా ప్రతి ఏడాది హిల్సా(పులసచేపలు) చేపల ఉత్పత్తిపైనే వారి ఆదాయం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దిఘా ఈస్ట్యూరీ ఫిష్ వేలం కేంద్రంలో ఏటా హిల్సా చేపల వేలం జోరుగా సాగుతుంది. ఇది తూర్పు భారతదేశంలో అతిపెద్ద సముద్రపు చేపల వేలం కేంద్రం. ఇక్కడి నుంచే విదేశాలకు చేపలను ఎగుమతి చేస్తారు. అయితే ఈ ఏడాది సరిగ్గా హిల్సా చేపలు వచ్చే సమయంలో వేడి వర్షాలు కురవడంతో వాటి ఉత్పత్తి ఘణనీయంగా తగ్గింది. దీంతో మత్స్యకారుల ఆదాయానికి గండిపడింది.  దిగాలుగా ఉన్న వారిని అనుకోని అదృష్టం వరించింది.

“తెలియా భోలా” చేపల రూపంలో వారి కష్టం తీరింది. లక్షల విలువ చేసే ఈ చేపలు మొత్తం 9 మత్స్యకారులకు లభించాయి. వీటి రేటు వింటే అవాక్కావ్వాల్సిందే. కేజీ రూ.31 వేలు వరకు ఉంటుంది. ఒక్కో చేప బరువు దాదాపు 25-30 కేజీలు ఉంటుంది. అంటే వీటి ధర కొన్ని లక్షల్లో ఉంటుంది. వీటికి ఎంత గిరాకీ ఉంటుందంటే జాలర్లు తెచ్చిన రోజే మొత్తం చేపలు అమ్ముడైపోయాయి. వీటిని ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ చేపలోని కొన్ని భాగాలను మందుల తయారీలో ఉపయోగిస్తారు.ఈ చేప పేగులను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ప్రపంచ మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇవి సాధారణంగా దొరకవు ఎందుకంటే సముద్రంలో లోపల ఇవి జీవిస్తూ ఉంటాయి. ఇక హిల్సా చేపలు దొరకక సతమతమవుతున్న జాలర్లకు తెలియా భోలా చేపల రూపంలో ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి.