“వివేక్ అగ్నిహోత్రి లేటెస్ట్ మూవీ ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. మొదట ది ఢిల్లీ ఫైల్స్ టైటిల్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమా బ్రిటిష్ రూల్ సమయంలో బెంగాల్‌లో జరిగిన చరిత్రలో మరిచిపోయిన ఘట్టాలను హార్డ్ హిట్టింగ్‌గా ఎక్స్‌పోజ్ చేస్తుందని టీజర్ సూచిస్తోంది. సస్పెన్స్, థ్రిల్లర్ టోన్‌లో తెరకెక్కిన ఈ సినిమా – అన్‌నోన్ ఫాక్ట్స్, సీక్రెట్స్‌ను సత్యాన్వేషణ చేస్తుందని సమాచారం. సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ‘కాష్మీర్ ఫైల్స్ లాంటి సంచలనం చేస్తుందా లేక వాక్సిన్ వార్ లాంటి ఫెయిల్యూర్ ని గుర్తు చేస్తుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
Also Read : Mass Maharaja : రవితేజ.. శివ నిర్వాణ.. మైత్రి మూవీస్
2022లో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ బాలీవుడ్‌లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. కాశ్మీరీ పండిట్ల జెనోసైడ్‌పై రియల్ ఇన్సిడెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న ఈ మూవీ కాంట్రవర్సీస్, పొలిటికల్ డిబేట్స్‌కి కేంద్రబిందువైంది. ఈ మూవీతో వివేక్ అగ్నిహోత్రి బిగ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత 2023లో విడుదలైన ది వాక్సిన్ వార్ ఇండియాలో కోవిడ్ వాక్సిన్ రీసెర్చ్‌పై బేస్ అయ్యింది. ఫ్రంట్‌లైన్ సైంటిస్టుల స్ట్రగుల్, ఇండియా సక్సెస్ స్టోరీని పేట్రియాటిక్ టోన్‌లో చూపించింది. కానీ ఈసారి రిజల్ట్ మాత్రం మిక్స్‌డ్. హైప్ ఉన్నా బాక్సాఫీస్‌లో కాష్మీర్ ఫైల్స్ రేంజ్ రిపీట్ కాలేకపోయింది. అయినా సబ్జెక్ట్ వల్ల చర్చనీయాంశం అయ్యింది.”మరి మూడు సినిమాలు, మూడు విభిన్న కథలు. ఇప్పుడు అందరి దృష్టి ది బెంగాల్ ఫైల్స్ మీదే ఇది మరో సంచలనాన్ని సృష్టిస్తుందా లేదా కాంట్రవర్సీ లిమిట్‌కే పరిమితం అవుతుందా అన్నది సెప్టెంబర్ 5తో క్లారిటీ రానుంది.”
