Site icon NTV Telugu

Mamata Banerjee: మళ్లీ తడబడిన ముఖ్యమంత్రి.. మహాభారతం ఎవరు రాశారో కూడా తెలియదా? మేడమ్

Mama

Mama

Mamata Banerjee: తన వాక్చాతుర్యంతో ఎంతో మందిని కట్టిపడేస్తుంటారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. మాటలు మాట్లాడటంతో ఆమెకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యర్థుల గురించి ఆమె మాట్లాడుతుంటే చుక్కుల కనిపిస్తాయి. దేశ ప్రధాని మోడీని సైతం ఎంతో ధైర్యంగా విమర్శిస్తుంటారు. ఇక అలాంటి మమత ఈ మధ్య తడబడుతున్నారు. ఒకరి పేరు చెప్పబోయి మరొకరి పేరు చెబుతూ ట్రోలింగ్ కు గురవుతున్నారు. చంద్రయాన్ 3 సందర్భంగా రాకేశ్ శర్మ చెప్పబోయి మమతా బెనర్జీ రాకేశ్ రోషన్ పేరు చెప్పారు. దీంతో ఆమె నెటిజన్లు ఆమెను ఓ ఆట ఆడుకున్నారు. ఇప్పుడు మరోసారి కూడా మమత తడబడ్డారు. మహాభారతాన్ని  కాజీ నజ్రుల్ ఇస్లామ్ రచించారని మాట్లాడారు. మమత బెనర్జీ ఇలా తడబడటంలో ఆ పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నారు.

Also Read: Karnataka: మాజీ సీఎంకు ఆస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

ఇక 1984 లో  సోవియెట్ యూనియన్ ప్రయోగించిన ఇంటర్‌కాస్మోస్ ప్రోగ్రామ్‌లో భాగమైన రాకేశ్ శర్మ అంతరిక్షంలో మొదట అడుగుపెట్టిన మనిషిగా రికార్డులకెక్కాడు. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు ఆయనే. ఇక మమత బెనర్జీ చంద్రయాన్ 3 సందర్భంగా మాట్లాడుతూ రాకేష్ శర్మ పేరు చెప్పబోయి రాకేశ్ రోషన్ పేరును తప్పుుగా పలికారు. రాకేశ్ రోషన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్న సంగతి తెలిసిందే. అయితే మమతా బెనర్జీకి నటుడికి సైంటిస్టట్ కి కూడా తేడా తెలియడం లేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

ఇక తాజాగా ఆమె మరోసారి తడబడ్డారు. .టీఎంసీపీ ఫౌండేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ మంగళవారం మాట్లాడుతూ, కేవలం బడిలో చదువుకున్నంత మాత్రానికి వాస్తవ జ్ఞానం రాదని, విశాలమైన మనసు ఉండాలని చెప్పారు. మనలో ఉన్న గొప్పవారు రచించిన రచనలను చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మమతా రవీంద్రనాథ్ ఠాగూర్, కాజీ నజ్రుల్ ఇస్లాం, వివేకానంద రచనలను చదవాలన్నారు చెప్పారు. ఈ క్రమంలోనే మహాభారతాన్ని నజ్రుల్ ఇస్లామ్ రాశారని చెప్పారు మమత. మహాభారతాన్ని వేద వ్యాసుడు రాసిన సంగతి తెలిసిందే. ఇక కాజీ నజ్రుల్ ఇస్లామ్ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పద్యాలు రాసేవారు. మమత వ్యాఖ్యలపై నెటిజన్లు ఈసారి ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Exit mobile version