కలబంద ప్రతీ ఇంట్లో సర్వ సాధారణంగా ఉంటుంది. అందం నుంచి ఆరోగ్యం వరకు కలబంద ప్రయోజనాలు, వాడకం ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. ఇంకా ఆయుర్వేద మందుల్లోను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, దీన్ని విరివిగా వాడతారు. కలబందలోని కాల్షియం ఎముకల పటిష్టతకు చాలా అవసరమైన పోషకం. ఇది మీ ఎముకలను బలోపేతం చేస్తుంది. తో మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అందానికే కాదు.. ఆరోగ్యానికి కలబంద ఉపయోగపడుతుంది. స్కిన్ ఎలర్జీలను దూరం చేస్తుంది. రోజ్ వాటర్, కలబంద రసం సమానంగా తీసుకుని బాగా కలపి ఆ మిశ్రమాన్ని చర్మంపై పూస్తే చర్మం కళకళ లాడుతుంది. అలోవెరా జెల్ పౌడర్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో కలబంద సప్లిమెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ గలదు. ఇది ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్‌ని తగ్గిస్తుంది.
READ MORE: Nitin Gadkari: వరుసగా మూడోసారి గెలిచిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..
కలబంద రసంలో కాస్తా కొబ్బరి నూనె వేసి బాగా కలపి మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న చోట పూస్తే నలుపు పోతుంది. ఉదయం పరగడుపున కల బందను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కలబందలోని ఎంజైములు పోషకాల శోషణ ప్రక్రియను మెరుగుపరచడంలో ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా ఇందులోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తాయి. కలబందలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంతో సహాయపడతాయి. ఇది పరోక్షంగా బరువు తగ్గేలా ప్రభావితం చేస్తుంది.