NTV Telugu Site icon

International Yoga Day 2024: వేసవిలో యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు..

New Project (4)

New Project (4)

జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. “యోగం” అనే పదం సంస్కృత మూలం “యుజ్” నుండి వచ్చింది, దీని అర్థం “చేరడం,” “కలయిక”, లేదా “ఏకం చేయడం”. మనస్సు – శరీరం, లేదా ఆలోచనలు – చర్యలు లేదా సంయమనం- సంతృప్తి లేదా మానవులు – ప్రకృతి మధ్య సామరస్యాన్ని యోగా ప్రతిబింబిస్తుంది. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు. శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతాయి. అయితే వేసవిలో యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

READ MORE: WhatsApp: వాట్సప్ వీడియో కాలింగ్ లో కొత్త ఫీచర్స్.. అవేంటో చూడండి

వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని కారణంగా అలసట మరియు అనారోగ్యంగా అనిపిస్తుంది. యోగా యొక్క కొన్ని ప్రత్యేక పద్ధతులు, శిశాసనం, శీతలీ ప్రాణాయామం మొదలైనవి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేడి ప్రభావాన్ని తగ్గిస్తాయి. వేసవిలో తరచుగా అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది. యోగా చేయడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. ఇది రోజంతా మనం చురుకుగా ఉండేందుకు సాయపడుతుంది. వేసవిలో అధిక వేడి, తేమ కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ధ్యానం, ప్రాణాయామ పద్ధతులు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆసనాలు, ప్రాణాయామం శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. వేసవిలో ఇది చాలా ముఖ్యం, శరీరానికి అదనపు జాగ్రత్త అవసరం.

READ MORE: International Yoda Day 2024: మంచు పర్వతాల నుంచి ఇసుక దిబ్బల వరకు భారత సైనికుల యోగా..

వేసవిలో దుమ్ము, కాలుష్యం పెరుగుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. యోగా శ్వాస పద్ధతులు, ప్రాణాయామం వంటివి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. వేసవిలో జీర్ణ సమస్యలు సర్వసాధారణం. యోగాలోని వివిధ ఆసనాలు, పవన్ముక్తాసనం, వజ్రాసనం మొదలైనవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. యోగా చేయడం వల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. వేసవిలో యోగా చేయడం వల్ల అదనపు క్యాలరీలు కరిగి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో నిద్ర సమస్యలు పెరుగుతాయి. యోగా యొక్క ధ్యానం, శ్వాస పద్ధతులు మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఇది మంచి నిద్రకు దారి తీస్తుంది. యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వేసవిలో ఈ ప్రయోజనాలను ఆస్వాదించడానికి, క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి.