జెడ్డాలో ఇటీవల ఐపీఎల్ 2025 మెగా వేలం జరిగింది. ఈ వేలంలో బిడ్డింగ్‌కు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన పేరును ఇవ్వలేదు. అయితే.. అందుకు గల కారణాన్ని స్టోక్స్ చెప్పాడు. ఐపీఎల్ కొత్త నియమాలు, మార్గదర్శకాల ప్రకారం.. స్టోక్స్ వేలంలో తన పేరును నమోదు చేసుకుంటే, అతను రాబోయే రెండేళ్లపాటు ఐపీఎల్ యాక్షన్‌లో కనిపించాలి. అయితే.. వీలైనంత ఎక్కువగా ఇంగ్లండ్‌కు ఆడటమే తన లక్ష్యమని, ఐపీఎల్‌లో ఆడాలన్న కోరిక లేదని ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ చెప్పాడు.
Read Also: Allu Arjun : కేరళలో భారీ ఎత్తున ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్
స్టోక్స్ మాట్లాడుతూ.. కెరీర్ చివరి దశలో ఉన్నానని, వీలైనంత వరకు ఇంగ్లండ్ జెర్సీని ధరించాలని అనుకుంటున్నానని చెప్పాడు. అందుకోసం తాను ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యమని అన్నాడు. ఈ కారణంగా ఐపీఎల్ మెగా వేలం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నట్లు చెప్పాడు. 2023 సంవత్సరంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. గాయం కారణంగా సీజన్‌లో చాలా వరకు అతను దూరంగా ఉన్నాడు.
Read Also: Kishan Reddy: అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. భారత్‌లో న్యూజిలాండ్ 3-0తో టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంపై బెన్ స్టోక్స్ ప్రశంసలు కురిపించాడు. భారత్‌లో స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 1-4 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత్‌లో సిరీస్ గెలవడం ఎంత కష్టమో స్టోక్స్‌కు తెలుసు. న్యూజిలాండ్ విజయం గురించి మాట్లాడుతూ.. క్రికెట్ ప్రపంచానికి ఇది శుభవార్త అని అన్నాడు. ఎందుకంటే కివీ జట్టు చేసిన పనిని ఏ జట్టు కూడా చేయలేకపోయిందని తెలిపాడు.